150 ఓట్లు రాలేదు: బైరెడ్డిపై విరుచుకుపడ్డ గౌరు చరితా రెడ్డి
కర్నూలు: మాజీ శాసనసభ్యుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాణ్యం శాససనభ్యురాలు గౌరు చరితా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పాణ్యం నియోజకవర్గం అభివృద్దికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆమె చెప్పారు.
బైరెడ్డి చరిత్ర అందరికీ తెలుసునని, ఆప్తులు అటూనే వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదని ఆమె మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని ఆమె అన్నారు.

ఎన్నికలకు ముందు హత్యులు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విదయ అని ఆమె విమర్శించార. చైతనైతే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ చేశారు.
గత ఎన్నికల్లో 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చరితారెడ్డి అన్నారు. గౌరు చరితా రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారంనాడు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications