ప్రోటోకాల్ వివాదం: వేదికపై ఏడ్చిన రాజమండ్రి మేయర్,షాకిచ్చిన గోరంట్ల
ప్రోటోకాల్ వివాదం రాజమండ్రిలో వివాదానికి కారణమైంది. రాజమండ్రి మేయర్ రజనీ శేషసాయి వేదికపైనే ఈ విషయమై ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
రాజమండ్రి: ప్రోటోకాల్ వివాదం రాజమండ్రిలో వివాదానికి కారణమైంది. రాజమండ్రి మేయర్ రజనీ శేషసాయి వేదికపైనే ఈ విషయమై ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వేదికపైనే కన్నీళ్ళు పెట్టుకొన్నారు. తనకు జరిగిన అన్యాయానికి మనస్థాపానికి గురై కార్యక్రమంలో పాల్గొనకుండానే మేయర్ రజనీ శేషసాయి వెళ్ళిపోయారు.
రాజమండ్రి వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వ్యవసాయశాఖాధికారులు పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్‌ను పాటించడం లేదని మేయర్ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వేదికపైనే మేయర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ పాటించని అధికారులు
రాజమండ్రి వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. ఈ కార్యక్రమంలో మేయర్ రజనీ శేషసాయి పేరు శిలాఫలకంపై రాయలేదు. దీంతో మేయర్ రజనీశేషసాయి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.కార్యక్రమం ప్రారంభోత్సవం సమయంలోనే ఈ విషయాన్ని గుర్తించిన మేయర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.

మంత్రి సోమిరెడ్డికి ఫిర్యాదు
వ్యవసాయ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించని విషయాన్ని మేయర్ రజనీ శేషసాయి సబా వేదికపైనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరహ పద్దతులు మానుకోవాలని ఆమె సూచించారు.

వేదికపైనే కన్నీళ్ళు పెట్టుకొన్న శేషసాయి
అధికారులు వ్యవసాయ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన వెంటనే మేయర్ రజనీ శేషసాయి కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ రకంగా వ్యవహరించారనే అభిప్రాయాలను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. వేదికపై కన్నీళ్ళు పెట్టుకొని మేయర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు.కన్నీళ్ళు పెట్టుకొంటూ ఆమె వేదిక దిగి వెళ్ళిపోయారు.

పబ్లిసిటీ ముఖ్యం కాదు
చిన్న విషయాలకు కలత చెందడం సరికాదని మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. రాజమండ్రి మేయర్ రజనీశేషసాయి పేరు శిలాఫలకంపై లేకపోవడంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకొన్న ఘటనపై ఆయన స్పందించారు. మాకు పబ్లిసిటీ కంటే ప్రజా సేవే ముఖ్యమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications