TTD: తిరుమలలో జగన్ గురువుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరుమలలో శారదా పీఠం చేపట్టిన అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం టీటీడీ అధికారులకు సూచించింది. ఈ దెబ్బతో వివాదాస్పద స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీకి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
2005 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలోని గోగర్భం జలాశయ ప్రాంతంలో శారదా పీఠానికి ఐదు వేల చదరపు అడుగల భూమిని 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. టీటీడీ నిబంధనలు పాటించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ అధికారులు శారదా పీఠం నిర్వహకులకు సూచించారు. అయితే శారదా పీఠం నిర్వహకులు మాత్రం తిరుమలలో అక్రమంగా కట్టడాలు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.

టీటీడీ ఇచ్చిన అనుమతులు పాటించకుండా శారదా పీఠం నిర్వహకులు అక్రమ కట్టడాలు నిర్మించారని వెలుగు చూసినా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అప్పటి టీటీడీ బోర్డు సభ్యులు కూడా శారదా పీఠం అక్రమ నిర్మాణల గురించి చూసిచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత శారదా పీఠం నిర్వహకులకు మళ్లీ చాన్స్ వచ్చింది.
జగన్ సీఎం అయిన తరువాత శారదా పీఠం మరోసారి తిరుమలలో అక్రమ కట్టడాలకు తెరలేపిందని తెలిసింది. అప్పటికే నిర్మించిన భవనం వెనుక టీటీడీ స్థలాన్ని ఆక్రమించి మరో కట్టడం నిర్మాణం చేపట్టింది. టీటీడీ నియమాలను పూర్తిగా పక్కనపెట్టి తిరుమలలో శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలకు అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

జగన్ సీఎంగా ఉండటం, టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉండటంతో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడానికి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం ధైర్యం చెయ్యలేదని తెలిసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శారదా పీఠం నిర్వహకులకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలోని భీమిలిలో జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి ఇచ్చిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరుమలలో శారదా పీఠం నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం టీటీడీ అధికారులకు సూచించడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications