భూదాహం తీరలేదా: పార్థసారథి, మాకు టిడిపి చెప్పడమా: బిజెపి ఎమ్మెల్యే కౌంటర్
విజయవాడ/రాజమండ్రి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి గురువారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. సర్కార్‌కు ఇంకా రాజధాని భూదాహం తీరలేదన్నారు.
రాజధాని అమరావతి కోసం అంటూ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు ఎందుకు సిద్ధమైందో ప్రజలకు వివరించారని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండొద్దనే దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వానిది అన్నారు. భూములు ఇవ్వని రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

టిడిపి నేతలపై బిజెపి ఎమ్మెల్యే ఆగ్రహం
టిడిపి నేతల పైన రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గురువారం మండిపడ్డారు. తమది నీతి, నిజాయితీతో కూడిన పార్టీ అన్నారు. ఈ విషయం టిడిపి నేతలు చెప్పవలసిన అవసరం లేదన్నారు. బుధవారం సాయంత్రం టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్ బిజెపి నేత సోము వీర్రాజుపై మండిపడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోము వీర్రాజు తెలుసుకొని మాట్లాడాలని చెప్పడం సరికాదన్నారు. తమకు టిడిపి నేతల హితబోధ అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంపై బిజెపి, కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టిడిపిదే అన్నారు.












Click it and Unblock the Notifications