ఏపిలో పథకాల లబ్దిదారుల కోత! 21.58 లక్షల మంది అనర్హులుగా: 14.25 లక్షల రేషన్ కార్డులు కట్!

Recommended Video

    AP Govt Identified Nearly 21.58 Lac People ineligible govt welfare schemes benefits

    ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల లబ్దిదారుల్లో కోత పడుతోంది. అనర్హుల పేరుతో లక్షలాది మందిని పధకాలకు దూరం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం పలు సంక్షేమ పధకాల్లో లబ్దిదారులుగా ఉన్న 21.58 లక్షల మందిని అనర్హులుగా తేల్చినట్లు తెలుస్తోంది. అందులో ఎక్కవ మంది రేషన్ కార్డు లబ్దిదారులే ఉన్నట్లు సమాచారం.

    దాదాపు 14.25 లక్షల అనర్హులు రేషన్ కార్డు కలిగి ఉన్నారని తాజాగా ప్రభుత్వం నిర్వహించిన వైయస్సార్ నవశకం సర్వేలో తేలింది. అదే విధంగా ఫించన్లు..ఆరోగ్య శ్రీ అందుకుంటున్న వారిలోనూ అనర్హుల సంఖ్య తేల్చారు నవంబర్ 20 నుండి డిసెంబర్ 20 దాకా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వైయస్సార్ నవశకం సర్వేలో ఈ అనర్హుల జాబితాను జిల్లాల వారీగా తేల్చారు.

    21.58 లక్షల మంది అనర్హులుగా..

    ప్రభుత్వ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ నవశకం పేరుతో వార్డు..గ్రామ వాలంటీర్లుతో ఇంటింటి సర్వే నిర్వహించింది. అందులో ప్రతీ ఇంటి నుండి సభ్యులు..వారి ఆదాయం వంటి వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించింది. ప్రభుత్వ పధకాల్లో లబ్దిదారులుగా ఉన్న వారి వివరాలను సమీకరించింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 11 సంక్షేమ పధకాలకు సంబంధించి ప్రజల నుండి కొత్తగా దరఖాస్తులు తీసుకోవటంతో పాటుగా లబ్దిదారుల అర్హతనూ పరిశీలించింది.

    అనేక దశల్లో లబ్దిదారుల వడపోత చేపట్టారు. అందులో రేషన్ కార్డులు..ఆరోగ్యశ్రీ.. జగనన్న విద్యా దీవెన.. వైయస్సార్ ఫించన కానుక..వంటివి అందుకుంటున్న వారి నుండి ఈ వివరాలు సేకరించారు. కాగా, ఈ వడపోత తరువాత ప్రాధమిక అంచనా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పధకాల్లో మొత్తంగా 21 లక్షల 58 వేల 375 మంది ప్రస్తుత లబ్దిదారుల్లో అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

    Govt identified 21.58 lac people in eligible for welfare schemes

    రేషన్ కార్డులు..ఫించన్లు..ఆరోగ్యశ్రీ లబ్దిదారుల్లో..

    లబ్దిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారిని తొలిగించే విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే, వారిని కొనసాగించే విషయంలో మాత్రం తర్జన భర్జన సాగుతోంది. ఇప్పటి వరకే ఈ సర్వేలో గుర్తించిన అంశాల మేరకు లక్షా 28వేల 95 వేల 585 మంది అర్హత లేక పోయినా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని గుర్తించారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ లబ్దిదారులుగా రెండు లక్షల 40 వేల 293 మందిని తేల్చినట్లు తెలుస్తోంది.

    ఇదే విధంగా.. ఫించను కానుక పధకంలో నాలుగు లక్షల 52 వేల 462 మంది అనర్హత పొందినట్లుగా తేల్చారు. జనన్న విద్యా దీవెన పధకంలో 40 వేల 529 మంది అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరి విషయం పైన తాజాగా జరిగిన వీడియో కాన్ఫిరెన్స్ లో చర్చ జరిగినా..తుది నిర్ణయం తీసుకోలేదు. అర్హత లేని వారికి కొనసాగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వీటి పైన మరోసారి వడపోత నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+