బడ్జెట్ వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం - కీలక మలుపు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 వార్షిక బడ్జెట్ ను రేపు (శుక్ర వారం) అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తొమ్మిది నెలల ప్రభుత్వం ఈ సారి పూర్తి స్థాయి లో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ పైన చంద్రబాబు పలుమార్లు సమీక్ష చేసారు. సంక్షేమం - అభివృద్ధి కి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

బడ్జెట్ సిద్దం
ఏపీ బడ్జెట్ 2025-26 ను సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. రేపు (శుక్రవారం) ఆర్దిక మంత్రి పయ్యావుల సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఈ సారి బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా 500 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. సంక్షేమం - అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటుగా అమరావతికి నిధుల కేటాయింపు కీలకంగా మారుతోంది.

Govt to allocated funds for Super Six Schemes in AP Budget 2025-26 to present on 28th

తల్లికి వందనం
ఇక, సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లికి ఏడాదికి రూ 15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హు లుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.10,300కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేసారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ 20 వేలు ఇవ్వాల్సి ఉంది.

రైతుల కోసం
అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధి కారులు తేల్చారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ 10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహా యించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇందు కోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభు త్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+