గుంటూర్ అల్లుడిని: జయదేవ్, మహేష్ ఫ్యాన్స్ స్వాగతం

అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలంటే సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి ఉందని, ఇవన్ని సక్రమంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తాను నమ్మి టిడిపిలో చేరినట్లు తెలిపారు.
రాజకీయాలు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం తనకు కొత్త అయినప్పటికీ ఏడు సెగ్మెంట్లను అధ్యయనం చేశానన్నారు. ఏడు సెగ్మెంట్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించానని, త్వరలోనే దానిని ప్రకటిస్తానని చెప్పారు.
పారిశ్రామికంగా తాను ఎన్నో విజయాలు సాధించడం జరిగిందని, ఆ అనుభవాన్ని ఉపయోగించి గుంటూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు. జయదేవ్ వెంట ర్యాలీలో టిడిపి నేతలతో పాటు కృష్ణ, మహేష్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు జాలాది రవి పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు తన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జయదేవ్ ప్రకాశం బ్యారేజ్ దాటి జిల్లాలోకి అడుగు పెట్టగానే తెదేపా శ్రేణులు భారీ సంఖ్యలో ఎదురెళ్లి బ్రహ్మరథం పట్టాయి. ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి, కాజా వద్ద ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలలో దేశం కార్యకర్తలు స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications