గ్రేటర్ విశాఖ వాసులకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి

గ్రేటర్ విశాఖ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు నగర ప్రజల పట్ల కూటమి రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరిని పరిశీలించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రజలు తమ అసంతృప్తిని తెలియజేసే ఏకైక ఆయుధం ఓటు అని ఆయన పేర్కొన్నారు.విశాఖపట్నం అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ గతంలోనూ, ప్రస్తుతం కూడా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందన్నారు.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలన్న జగన్ ప్రతిపాదనను గతంలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. విశాఖపట్నం ప్రజలకు చెందాల్సిన విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు నామమాత్రపు ధరలకు తమ బంధువులకు, అనుచరులకు ధారాదత్తం చేస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. విశాఖ చుట్టుపక్కల కొండలను తవ్వుతూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

Greater visakha elecions Former Minister Dharmana Prasada Rao Accuses TDP of Bias Against Visakhapatnam Development

విశాఖపట్నం నగర అభివృద్ధికి వినియోగించాల్సిన జీవీఎంసీకి చెందిన సుమారు రూ.1,738 కోట్ల నిధులను అమరావతికి మళ్లించారన్నారు. నగరంలో మురికివాడలు, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులను ఇక్కడ వినియోగించాలని డిమాండ్ చేశారు. వర్షం పడితే నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఈ రెండున్నరేళ్ల కాలంలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు.

వేసవిలో విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, పోలవరం బ్యారేజీ ఎత్తు తగ్గింపు నిర్ణయంతో ఉత్తరాంధ్ర నీటి అవసరాలను దెబ్బతీశారన్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు, నిర్వాసితులు, స్థానిక ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని అనుసరిస్తోంది

టెక్కలి ప్రాంతంలోని డీప్ వాటర్ సీపోర్ట్ పనులు, శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెంలో రూ.400 కోట్లతో చేపట్టాల్సిన ఫిషింగ్ హార్బర్, అనకాపల్లి జిల్లా పూడిమడక ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ముందుకు సాగకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానించే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే పనుల ప్రాజెక్టులను గతంలో జగన్ కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తే కూటమి ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన పేర్లు వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. విశాఖపట్నంలో స్థానిక సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా చంద్రబాబు అణగదొక్కుతున్నారన్నారు. తన కుటుంబీకులు, బంధువుల చేతిలో పెత్తనం పెడుతున్నారన్నారు.

మాచర్ల పోరు.. వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల పోరు.. వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వరుదు కళ్యాణికి కౌన్సిల్‌లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి పోరాడే సామర్థ్యం కూడా ఉందన్నారు. విశాఖలో స్థిరపడిన శ్రీకాకుళం ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతానికి చెందిన వరుదు కళ్యాణి అభ్యర్థిత్వాన్ని గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో బలపరచాలన్నారు. విశాఖపట్నం అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఎన్నికల్లో కూటమి పార్టీలపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తిరగబడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+