డబుల్ బొనాంజా.. భార్యభర్తలిద్దరికీ "గ్రూప్ 2" ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-2 తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ రిజల్ట్స్ తో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలు నెరవేరాయి. 2023లో 905 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. కోర్టు కేసులు, రిజర్వేషన్ రోస్టర్, స్పోర్ట్స్ కోటా వివాదాల కారణంగా తుది జాబితా విడుదల ఆలస్యమైంది. 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ వెలువడగా.. ప్రిలిమినరీ పరీక్ష 2024 ఫిబ్రవరి 25న, మెయిన్స్ పరీక్షలు 2025 ఫిబ్రవరి 23న నిర్వహించారు.

కాగా మెయిన్స్ ఫలితాలు 2025 ఏప్రిల్ 4న వెల్లడయ్యాయి. కానీ తుది ఫలితాల విడుదలకు మాత్రం ఇంత సమయం పట్టడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశతో ఎదురుచూస్తూ వచ్చారు. కాగా ఈ ఫలితాల్లో అనేకమంది స్ఫూర్తిదాయకమైన విజయగాథలు వెలుగులోకి వచ్చాయి. తాడిపత్రికి చెందిన దంపతులు ఇద్దరూ గ్రూప్-2 కొలువును సాధించడం చర్చనీయాంశంగా మారింది.

group-2-final-results-are-out-and-husband-and-wife-from-tadipatri-both-got-government-jobs-then-news

భార్యభర్తలిద్దరికీ ఉద్యోగాలు..

అనంతపురం జిల్లా గన్నెవారిపల్లికి చెందిన హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్‌-2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూనే, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. లేటెస్ట్ గా విడుదల అయిన ఫలితాల్లో ఈ దంపతులిద్దరూ ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నారు. వినత సబ్-రిజిస్ట్రార్‌గా ఎంపిక కాగా.. హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకమయ్యారు.

అన్నదమ్ములు..

మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన అన్నదమ్ముల విజయం కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. వేణుగోపాల్ గతంలో గ్రూప్‌-2లో సీనియర్ అసిస్టెంట్ పోస్టును సాధించి ప్రస్తుతం విజయవాడలోని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. అలానే వేణుగోపాల్ సోదరుడు ఓంప్రకాశ్ కూడా అంతకుముందు జరిగిన గ్రూప్‌-2లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ సహాయకుడిగా పలు ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో సేవలందిస్తున్న ఓంప్రకాశ్.. ఈసారి గ్రూప్-2లో రాష్ట్ర సచివాలయంలో ఏఎస్‌వో ఉద్యోగాన్ని దక్కించుకున్నారు.

ఇక ఈ నోటిఫికేషన్ విషయంలో రిజర్వేషన్ రోస్టర్‌కు సంబంధించిన వివాదాలు, స్పోర్ట్స్ కోటాపై హైకోర్టులో నడిచిన కేసులు ఈ ఆలస్యానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లను పరిశీలించే బాధ్యతను చేపట్టిన షాప్ (SAP) సంస్థ సైతం ఎక్కువ సమయం తీసుకోవడంతో అభ్యర్థులు సుదీర్ఘకాలం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఈ వివాదాలన్నీ ఒక కొలిక్కి రావడంతో తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+