ఏపీ నిరుద్యోగులకు శుభవార్త: గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 982 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పి ఉదయ్‌భాస్కర్ తెలిపారు.
తొలిసారిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులను పూర్తి ఆన్‌లైన్‌లో విధానంలో స్వీకరిస్తామన్నారు. 25 వేల మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక పరీక్షను ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్ పరీక్ష మాత్రం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నామన్నారు.

నోటిఫికేషన్‌కు ముఖ్యమైన వివరాలు
నవంబర్ 11, 2016 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 10.12.2016
-ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 26, 2017
-మెయిన్స్ పరీక్ష: మే 20, 21వ తేదీల్లో (2017)
పూర్తి వివరాల కోసం www.psc.ap.gov.in వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.
వయెపరిమితి: సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-2 (20-42 సంవత్సరాల మధ్య), ఎక్సైజ్ ఎస్సై (18-28 సంవత్సరాల మధ్య) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 442
-నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 540
-మొత్తం పోస్టుల సంఖ్య: 982












Click it and Unblock the Notifications