నలుగురు పిల్లల తల్లి-15 ఏళ్ల బాలుడితో జంప్-పోర్న్ వీడియోలతో ట్రాప్-కట్ చేస్తే కటకటాల్లోకి..

చిన్నతనంలోనే పెళ్లి.. నలుగురు పిల్లల్ని కన్నాక భర్య అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆమె మనసు మరో మగాడిపైకి మళ్లింది. చివరికి ఎదురింట్లో ఉన్న 15 ఏళ్ల బాలుడు కనిపించాడు. ఎలాగైనా ట్రాప్ చేయాలనుకుంది. చివరికి బుట్టలో పడేసింది. అతన్ని హైదరాబాద్ కు లేపుకుపోయింది. రంగంలోకి దిగిన బాలుడి తల్లితండ్రులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు గాలించి ఇద్దరినీ పట్టుకున్నారు. గుడివాడ తీసుకొచ్చారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

గుడివాడలో షాకింగ్ ఘటన

గుడివాడలో షాకింగ్ ఘటన

గుడివాడలో కాపురం ఉంటున్న ఓ నలుగురు పిల్లల తల్లి తన ఎదురింట్లో ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. తన భర్త అనారోగ్యం పాలవడంతో దూరంగా ఉంటోంది. ఒంటరితనం వేధించిందో, బాలుడిపై కన్ను పడిందో తెలియదు కానీ వయసు అంతరం, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేకుండా పోయాయి. చివరికి అతన్ని ట్రాప్ చేసి కలిసి ఎవరికీ అనుమానం రాకుండా లేచిపోయారు. స్ధానికులకు అనుమానం వచ్చింది. బాలుడి తల్లితండ్రులకు కూడా విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగారు.

హైదరాబాద్ వెళ్లి సహజీవనం

హైదరాబాద్ వెళ్లి సహజీవనం

పోలీసుల విచారణలో సదరు మహిళ బాలుడితో హైదరాబాద్ కు వెళ్లినట్లు గుర్తించారు. వీరిద్దరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయగా హైదరాబాద్ లోని బాలా నగర్ లో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. నెల రోజులుగా సాగిన సహజీవనానికి పోలీసులు బ్రేక్ వేశారు. హైదరాబాద్ వెళ్లి వీరిద్దరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. గుడివాడ తీసుకొచ్చి విచారించారు. ఇందులో పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ వివరాల్ని గుడివాడ పోలీసులు బయటపెట్టారు.

పోర్న్ వీడియోలతో ట్రాప్

పోర్న్ వీడియోలతో ట్రాప్

విచారణలో మహిళ చెప్పిన విషయాలు పోలీసుల్ని సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోర్న్ వీడియోలు చూడటాన్ని అలవాటుగా మార్చుకున్న సదరు మహిళ.. వాటినే బాలుడికి చూపించి ట్రాప్ చేసినట్లు తెలిసింది. అసలే యుక్త వయసులో ఉన్న బాలుడు వీటి మోజుతో సదరు మహిళకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఇంకా అక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని, దొరికిపోతామన్న భయంతో ప్లాన్ మార్చింది. దీంతో తన పిల్లల్ని,కాపురాన్ని, అనారోగ్యంతో ఉన్న భర్తను వదిలేసి బాలుడితో కలిసి హైదరాబాద్ కు లేచిపోయినట్లు తేలింది. అక్కడ బాలుడితో కలిసి నెల రోజులుగా సహజీవనం చేస్తోంది. అంతా సవ్యంగానే ఉన్నట్లు వీరిద్దరూ అనుకుంటున్న తరుణంలో పోలీసులకు చిక్కారు.

పిల్లల భవిష్యత్తు గాలికి

పిల్లల భవిష్యత్తు గాలికి

వయసుతో సంబంధం లేకుండా, సమాజానికి భయపడకుండా చేసిన నేరానికి గానూ ఈ గుడివాడ మహిళ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. మైనర్ బాలుడికి పోర్న్ వీడియోలు చూపించి ట్రాప్ చేసి సహజీవనం చేయడమే కాకుండా, లేవదీసుకుపోయిన ఈ కిలాడీని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చిన్న వయసుల్లోనే పెళ్లి చేసుకుని 30 ఏళ్లలోపే నలుగురు పిల్లల్ని కనేసిన ఆ వివాహిత... వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా చేసిన బరితెగింపు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+