ఫలించిన జగన్ ప్లాన్ - త్వరలో సముద్రమార్గంలో 6 వేల మంది వెనక్కి....
ప్రభుత్వాలు తలచుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నించడమొక్కటే మార్గం. సరిగ్గా ఇదే చేశారు దేశంలో రెండు రాష్ట్రాల సీఎంలు. ఇప్పుడు వీరిద్దరి ప్రయత్నం ఫలిస్తే ఏపీకి ఆరువేల మంది మత్స్యకారులు సముద్ర మార్గంలో ఏపీలోని స్వస్ధలాలకు చేరుకుంటారు. ఇంతకీ వీరు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు తిరిగొస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
గుజరాత్ లో ఏపీ మత్స్యకారులు..
ఏడాది పొడవుగా ఉపాధి కోసం దేశంలోని వివిధ సముద్ర తీర రాష్ట్రాల్లోని రేవులకు ఏపీకి చెందిన దాదాపు 50 వేల మందికి మత్య్యకారులు వెళ్తుంటారు. వీరంతా చేపల వేట నిలిచిపోయే వేసవి కాలంలో రెండు నెలల పాటు స్వస్దలాలకు తిరిగి వచ్చేస్తుంటారు. ఇలా గుజరాత్ లోని వెరైవల్ రేవుకు వెళ్లిన ఆరు వేల మంది మత్స్యకారులు ఏపీకి తిరిగి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. ఉపాధి లేక, తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరి విషయంలో వివిధ రాజకీయ పార్టీలు, మత్సకార కుటుంబాల నుంచి వచ్చిన వినతుల మేరకు సీఎం జగన్... గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు.

ఫలించిన ప్రయత్నాలు- సముద్ర మార్గానికి ఓకే..
వెరైవల్ రేవులో చిక్కుకున్న ఆరువేల మంది ఏపీ మత్స్యకారులను ఏదో విధంగా స్వస్ధలాలకు తిరిగి పంపాలని జగన్ చేసిన అభ్యర్ధనతో గుజరాత్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. రోడ్లు, రైలు, విమాన మార్గాలు మూసుకుపోయాయి. ఇక మిగిలింది సముద్ర మార్గమే. అదీ కష్టంతో కూడుకున్నదే. అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ఎంటరైతే తప్ప వీరు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం లేదు. అయినా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసేందుకు ముందుకు రావడంతో వీరిని పంపేందుకు గుజరాత్ సీఎం రూపానీ సరేనన్నారు. కరోనా వ్యాప్తి నేఫత్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని మత్స్యకారులను తీసుకెళ్లేందుకు అంగీకరించారు. దీంతో త్వరలో వీరిని అక్కడి నుంచి వెనక్కి తెప్పించేందుకు ఏపీ ప్రభుత్వం బోట్లను పంపనుంది.












Click it and Unblock the Notifications