వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు దాటినా... ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలు వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు సెగలు రేపుతూనే ఉన్నాయి.

తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది.

Gulabi Colour Dispute between two telugu states!

ఈ వ్యవహారంపై ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టును గులాబీమయం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

గతంలో కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఈ తాజా వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరి!

English summary
One more dispute araised between Andhra Pradesh and Telangana. The cause is - painting gulabi colour to nagarjuna sagar project walls. Leaders of AP state firing on Telangana government in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X