మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు -అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!
ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం నానాటికీ దారుణంగా మారిపోతోంది. సోషల్ మీడియా వేదికగా గతంలో రాజకీయ నాయకులు, వారి ప్రత్యర్థులు మాత్రమే విమర్శలు, కౌంటర్లు వేసుకోగా.. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్ని సైతం ఇందులోకి లాగేస్తున్నారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పైనా విమర్శలకు దిగారు. దీంతో గుంటూరు పోలీసులు ఒకరిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

గత వారం సింగపూర్ లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో గాయాలయ్యాయి. దీంతో పవన్ హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో పవన్ కుమారుడు కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ కొందరు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు మాత్రం మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇవాళ వెల్లడించారు. మార్క్ శంకర్ పై పెట్టిన పోస్ట్‌లపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్క్ శంకర్ పై పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఇవాళ అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అలాగే అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్‌లో భాగంగా అతడు ఈ పోస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అల్లు అర్జున్‌కు మద్దతుగా ఉన్న ఇతను.. మెగా కుటుంబంపై ద్వేషం పెంచుకున్నాడని వెల్లడించారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడని పోలీసులు గుర్తించారు. అలాగే ఇతని పోలీసులకు లైక్స్ కొట్టిన వారిని సైతం గుర్తిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి మొత్తం 37 పోస్టుల్ని తాము గుర్తించి డౌన్ లోడ్ చేసినట్లు వెల్లడించారు. వాటిపైనా కేసులు పెడతామన్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications