పెళ్లయిన తొలి రాత్రే... భార్యకు ఊహించని షాక్... పోలీసులకు ఫిర్యాదు...
ఎన్ఆర్ఐ సంబంధం అని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులు,యువతికి ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పెళ్లయి పట్టుమని పది రోజులు కూడా గడవకముందే అతని అసలు బండారం బయటపడింది. అతను గే అని తెలియడంతో మోసపోయానని గ్రహించింది. పైగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో... న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే... గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్ వరకు చదువుకుంది. పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి అనే యువకుడితో ఆమెకు ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. భాస్కర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండటంతో.. రూ.50లక్షలు కట్నం,50సవర్ల బంగారం ఇతరత్రా కట్న కానుకలతో ఘనంగా పెళ్లి జరిపించారు.

Recommended Video
కానీ పెళ్లయిన తొలిరోజు రాత్రే అసలు విషయం బయటపడింది. తాను గే అని,కాపురం చేయలేనని భార్యతో అతను చెప్పేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు అమెరికాలో తనకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని... నువ్వు కూడా అతనితో కాపురం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అంతేకాదు,అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశాడు. దీంతో తల్లిదండ్రులతో చెప్పిన ఆ యువతి... వారి సహకారంతో గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సంసారానికి పనికిరాని కొడుకునిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేసిన అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications