సమైక్య సభ: జగన్‌పై గుత్తా ఫైర్, పురంధేశ్వరికి కితాబు

Gutta Sukhender Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్య శంఖారావం పేరుతో సభను నిర్వహించాలని చూస్తోందని కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. హైదరాబాదులో జగన్ పార్టీ సభకు అనుమతి రావడం దురదృష్టకరమన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ సభను ఉపసంహరించుకోవాలని కోరారు. సమైక్య శంఖారావం సభ సందర్భంగా ఘర్షణలు చెలరేగే ప్రమాదముందన్నారు. విభజనపై కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేసి నవ్వుల పాలయ్యారన్నారు.

మరోవైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 19లోగా మంత్రుల బృందం(జివోఎం) సమావేశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారాన్ని కేంద్రం కోరింది. శాఖల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర శాఖలకు కూడా ప్రాంతాల వారీగా వివరాలు తెలపాలని ఈ నెల 11న కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు.

కేంద్ర హోంశాఖ ప్రధాన అంశాలపై వివరాలు కోరింది. ప్రాంతాల వారీగా వ్యవసాయ, పారిశ్రామీక రంగాల విస్తరణణ, ఆస్తులు - అప్పులు, ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని కోరింది. 19న జరిగే జివోఎంలో ఈ అంశాలపై చర్చించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+