వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై హరీష్ ఫైర్: రాజకీయ విమర్శపై 'మెట్రో' వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
నల్గొండ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గురువారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అధినేత ప్రోద్బలంతోనే సుప్రీం కోర్టులో కేసు వేశారని ఆరోపించారు.

హరీష్ రావు నల్గొండ జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్ట పోయిన వారికి ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెరాస ముందంజలో: కెటిఆర్

ఎవరికి నచ్చనా నచ్చకపోయినా... తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తగ్గట్లుగా తెరాస వ్యవహరిస్తుందని ఆ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అన్ని సర్వేల్లోను తమ పార్టీ ముందంజలో ఉందని చెప్పారు. తెలంగాణ కల సాకారమవుతోందంటే దానికి కారణం తెరాసనేనని ప్రజలు గుర్తించారన్నారు.

రాజకీయ విమర్శలపై మెట్రో స్పందన

మెట్రో రైలు ప్రాజెక్టు పైన రాజకీయ నాయకుల అవినీతి ఆరోపణలలో వాస్తవం లేదని ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండి ఎన్‌విఎస్ రెడ్డి హెదరాబాదులో తెలిపారు. 2014 డిసెంబరు నాటికి మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మెట్రో రైలు టెండర్లు, భూపరిహారం చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని, 2015 ఉగాది నాటికి మెట్రో రైలును ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

మెట్రోను అడ్డుకునేందుకు కొంతమంది ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారన్నారు. అగ్రిమెంట్ ప్రకారమే మెట్రో ప్రాజెక్టు స్థలాలు తీసుకున్నామని, అసలు ఎల్ అండ్ టి చరిత్రలోనే ముడుపుల సంస్కృతి లేదన్నారు. కోర్టు కేసులు ఎదుర్కొంటూ పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన అంశం ప్రాజెక్టు పైన ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

English summary

 Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao on Thursday fired at TDP chief Nara Chandrababu Naidu for his stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X