టిడిపి ఖాళీ: హరీష్ రావు, విభజన జరిగింది: జెడి శీలం

Harish Rao fires at TDP
నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులుండవని, కొద్ది రోజుల్లోనే తెలంగాణలో టిడిపి ఖాళీ అవడం ఖాయమని తెరాస సిద్ధిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లాలో తెరాస ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో హరీష్ రావు మాట్లాడారు. మొన్న పోచారం, గంప గోవర్దన్, హన్మంత్ షిండే, నిన్న మహేందర్‌రెడ్డి, రేపు నగేష్‌లు ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయి తెరాసలో చేరుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు తన సామాజిక వర్గీయుడైన బిజెపి నేత వెంకయ్యనాయుడుతో కలిసి చేయని ప్రయత్నం లేదని విమర్శించారు. రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం అని చెప్పుకునే చంద్రబాబు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి తన సర్వశక్తులను ఒడ్డాడని ఆయన ధ్వజమెత్తారు. తెరాస కాంగ్రెస్‌లో విలీనం కావడానికి యావత్ తెలంగాణ ప్రజానీకం నిరాకరిస్తోందన్నారు.

విభజన జరిగింది: శీలం

తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందని, రెండు రాష్ట్రాలకు పంపకాలే మిగిలాయని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో సీమాంధ్రను ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ప్రత్యేక హోదా కల్పించటం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది 12 వేల కోట్లరూపాయలు వస్తాయన్నారు. పన్ను రాయితీల వల్ల పరిశ్రమలు అత్యధికంగా వస్తాయని తెలిపారు. మాయమాటలు చెప్పి, నాటకాలు వేసే వారు వస్తుంటారని అలాంటి వారి మాటలు ప్రజలు నమ్మరాదని కోరారు. శాంతి, సమాధానం కోరుకునే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. విషబీజాలు నాటే బిజెపితో పొత్తు కుదుర్చుకునే వారిని నమ్మరాదన్నారు.

టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై కన్నా

విభజనలో సీమాంధ్రను నిరభ్యంతరంగా తాకట్టు పెట్టి నేడు ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు వెన్నుపూస లేనట్లేనని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు చంద్రబాబు, జగన్, కిరణ్‌ కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి కొమ్ములు తెచ్చుకొని వాటితో కుమ్మడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

వారిపై కేసులు పెట్టాలి

కిరణ్, లగడపాటి రాజగోపాల్‌పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని పార్లమెంట్ సభ్యుడు వివేక్ డిమాండ్ చేశారు. వీరిద్దరు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారన్నారు. కెసిఆర్ కలలు గన్న తెలంగాణను నిర్మించుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+