ట్రూ హీరో తో కలిసి భోజనం చేశా- హ్యాపీ
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీలోని హోటల్ అశోకలో ఈ భేటీ ఏర్పాటైంది. బీజేపీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు ఇందులో పాల్గొన్నారు.

ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కావడం వల్ల ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దీనికి హాజరయ్యారు. భారత్ 4.18 ట్రిలియన్ల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం పట్ల వాళ్లంతా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తమ అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ సారథ్యంలో దేశం ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రశంసించారు. మోదీ దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో వచ్చిన 2014 నుండి దేశం పురోగతి సాధిస్తూనే వస్తోందని, ప్రగతిశీల పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
దశాబ్ద కాలంలో ఎన్డీఏ సుపరిపాలన కింద భారత్ వృద్ధి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోందని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. సరికొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల వంటి ఎన్నో ఘన విజయాలను భారత్ అందుకుందని పేర్కొన్నారు.
ఇది కేవలం ఆర్థిక విజయం కాదని, అంతకు మించినదని వ్యాఖ్యానించారు. ఆధునిక భారత్ సాధిస్తోన్న పురోగమనానికి, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, వికసిత్ భారత్ - 2047 వైపు నడిపించడానికి ప్రధాన అడుగు పడిందని చెప్పారు.
ఈ సమావేశం భోజన విరామ సమయంలో ప్రధాని మోదీని కలిశారు పవన్ కల్యాణ్. ఆయనతో కలిసి భోజనం చేశారు. మోదీ, పవన్ కల్యాణ్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గ నాయకులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఒకే టేబుల్ పై భోజనం చేశారు.
ఈ ఫొటోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. భారత ట్రూ హీరోతో కలిసి భోజనం చేశానని చెప్పారు. మోదీని నిజమైన హీరోగా అబివర్ణించారు. దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధత తామందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారాయన.
Having lunch with ‘True Hero’ of our Bharat and our beloved Leader‘ Hon PM Sri @narendramodi ji.’
— Pawan Kalyan (@PawanKalyan) May 25, 2025
His love and commitment for Nation is always inspiring to all of us.@mieknathshinde @AjitPawarSpeaks @BJP4India @JanaSenaParty pic.twitter.com/s1fjiZ6wPb












Click it and Unblock the Notifications