ఆ ఒక్క రైలు... భారతీయ రైల్వేకు కాసుల వర్షం కురిపిస్తోంది!
భారతీయ రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వేలైను ఉంది. అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో మూడోలైను కూడా నిర్మిస్తుండటం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు ప్రయాణికులకు కూడా ఆధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 13,452 రైళ్లు ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
రైల్వే పాలిట కల్పవృక్షం
రైల్వేకు సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వస్తుంది. దేశంలో శతాబ్ది, రాజధాని, వందేభారత్ లాంటి రైళ్లు నడుస్తున్నాయి. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ, ప్యాసింజర్, మెము, ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇన్ని రైళ్లల్లో ఒకే ఒక్క రైలు భారతీయ రైల్వే పాలిట కల్పవృక్షంలా మారింది. భారతీయ రైల్వేకు ఈ రైలు అత్యధిక ఆదాయాన్ని తీసుకొస్తోంది. అవి వందేభారత్ కాదు.. శతాబ్ది రైళ్లు కాదు.. కేవలం రాజధాని రైళ్లే. అందులోను హజరత్ నిజాముద్దీన్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ (22692) అగ్రస్థానంలో నిలిచింది.

రూ.176 కోట్ల వార్షికాదాయం
గత ఆర్థిక సంవత్సరంలో ఈ రైలుద్వారా 5.10 లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణాలు చేశారు. వారిద్వారా రూ.176 కోట్ల ఆదాయం సమకూరింది. రాజధాని ఎక్స్ ప్రెస్ తర్వాత స్థానంలో సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ (12314) నిలిచింది. పశ్చిమబెంగాల్ లోని సీల్దా (కోల్ కతా) నుంచి న్యూఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ద్వారా 5.10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి రైల్వేకు రూ.129 కోట్ల ఆదాయాన్ని అందించారు. ఈ రెండు రైళ్ల తర్వాత మూడోస్థానంలో న్యూఢిల్లీ నుంచి దిబ్రూఘర్ వరకు నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిచింది. ఈ రైలు ద్వారా 4.75 లక్షల ప్రయాణికులు ప్రయాణించి రూ.127 కోట్ల ఆదాయాన్ని రైల్వేకు అందించారు.












Click it and Unblock the Notifications