షర్మిళపై సోషల్ మీడియాలో బూతు కామెంట్స్... హరీష్ చౌదరి అరెస్ట్

షర్మిల పై సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన హరీష్‌ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబ్ లో షర్మిల పై అసభ్యమైన పోస్టులు చేసిన వ్యక్తి

యూట్యూబ్ లో షర్మిల పై అసభ్యమైన పోస్టులు చేసిన వ్యక్తి

వైకాపా అధినేత జగన్‌ సోదరి షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకరమైన పదజాలంతో ఒక వ్యక్తి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా, చంద్రబాబు నాయుడు పై ఆమె మండిపడుతున్న సమయంలో, అదే సమయంలో దివి హరీష్ చౌదరి అనే వ్యక్తి మూడుసార్లు వరుసగా అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. చాలా వల్గర్ భాషలో బూతులు తిట్టిన ఆ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల మండలి వైస్‌చైర్మన్‌ బి.అనిల్‌ సాయంత్రం హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐపీ అడ్రెస్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు .. నిందితుడు ఫార్మా సంస్థలో ఉద్యోగి

ఐపీ అడ్రెస్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు .. నిందితుడు ఫార్మా సంస్థలో ఉద్యోగి

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతను యూట్యూబ్ లో అప్ లోడ్ చెయ్యటానికి వాడిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడు చౌటుప్పల్‌ రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరీష్ అని గుర్తించారు . గతంలో హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో పనిచేశాడని తెలుసుకున్న పోలీసులు అతణ్ణి వివరాల ఆధారంగా చౌటుప్పల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం చౌటుప్పల్‌ సమీపంలో తంగెడిపల్లిలోని ఓ ఫార్మాసూటికల్‌ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చౌదరి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు కు చెందిన వాడు.

నిందితుడి అరెస్ట్ .. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు

నిందితుడి అరెస్ట్ .. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు

వైఎస్‌ షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసి ఐపీ అడ్రస్‌ ఆధారంగా హరీష్‌ చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకాశం జిల్లా బొమ్మనంపాడుకు చెందిన హరీష్‌పై 354ఏ, 509, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతం లోనూ షర్మిల పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని, అసభ్యకర పోస్ట్ లు పెట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో అన్న కు బాసటగా ప్రచారం చెయ్యనున్న షర్మిల ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనున్నారో .. అందుకే ఈ తరహా ట్రోల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+