heart breaking.. చంద్రబాబు ఆరోగ్యంపై నారా బ్రాహ్మణి!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పట్ల, అక్కడ పరిసరాల పట్ల మొదటి నుంచి టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా చంద్రబాబు జైల్లో అలర్జీ బారిన పడడంతో కుటుంబ సభ్యుల నుంచి మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. జైలులో చంద్రబాబును దోమలు ఉన్నాయని, చంద్రబాబు కు ఇస్తున్న తాగునీరు కూడా అపరిశుభ్రంగా ఉంటుందని, ఆయన 5 కిలోలు బరువు తగ్గిపోయారని, అలెర్జీ బారిన పడ్డారని ప్రస్తుతం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగనే బాధ్యత వహించాలని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే నారా లోకేష్, నారా భువనేశ్వరి స్పందించగా, తాజాగా నారా బ్రాహ్మణి స్పందించారు. చంద్రబాబు గారి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.
ఏ విధంగాను అనుకూలంగా లేని, అపరిశుభ్రమైన జైలు వాతావరణంలో ఆయన నిర్బంధించబడ్డారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో ఉందని, ఆయన ఆరోగ్యం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగా చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని పేర్కొన్నారు.
జైల్లో సకాలంలో చంద్రబాబుకు వైద్యం అందడం లేదని, ఆయన 5 కిలోల బరువు తగ్గి పోయారని, ఇంకా ఆయన బరువు తగ్గితే ఆయన మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పినట్టు నారా బ్రాహ్మణి తెలిపారు. తాము ఆయన ఆరోగ్యం గురించి తీవ్రంగా బాధ పడుతున్నామని, తీవ్ర ఆందోళనలో ఉన్నామని ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబు ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జగన్ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications