Jaahnavi kandula: 262కోట్ల పరిహారం వేళ బిగ్ షాక్-మరో పెను విషాదం..!
అమెరికాలోని సియాటిల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (jaahnavi kandula) కుటుంబంలో తాజాగా మరో పెను విషాదం చోటు చేసుకుంది. సియాటిల్ పోలీసు అధికారి పెట్రోలింగ్ వాహనం ఢీకొన్ని జాహ్నవి మృత్యువాత పడ్డ రెండేళ్ల తర్వాత ఆమె కుటుంబం ఈ కేసులో న్యాయపరమైన విజయం సాధించింది. ఈ విషయంపై ప్రకటన వచ్చేలోపే ఆదోనిలో ఉంటున్న ఆమె తండ్రి అనూహ్య రీతిలో తుదిశ్వాస విడిచారు.
సియాటెల్ లో పోలీసు అధికారి నడిపిన పెట్రోలింగ్ వాహనం ఢీకొని కందుల జాహ్నవి చనిపోయిన తర్వాత రెండేళ్లుగా ఆమె కుటుంబం పరిహారం కోసం అమెరికాలో న్యాయపోరాటం చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. దీంతో తాజాగా జాహ్నవి కుటుంబంతో 262 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకునేందుకు సియాటిల్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అక్కడి అటార్నీ నుంచి నిన్న ప్రకటన వెలువడటంతో భారత్ లో అంతా సంతోషించారు.

కానీ విచిత్రంగా ఈ ప్రకటన రావడానికి 48 గంటల ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్ చనిపోయారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జాహ్నవి తండ్రి శ్రీకాంత్.. ఆమె మరణం తర్వాత దీన్ని భరించలేక దీర్ఘకాల సెలవులో ఉన్నారు. ఆయన తన కుమార్తె గురించి వార్తలను తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాంత్ కు అనంతపురం జిల్లా గుంతకల్ పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు వెళుతుండగా ఆటోలో ఆయన గుండెపోటుతో చనిపోయారు. కూతురు చనిపోయిందని అమెరికాలో పోరాడి 262 కోట్లు పరిహారంగా లభిస్తున్న సమయంలో ఇలా తండ్రి కూడా చనిపోవడంతో ఆమె కుటుంబంతో పాటు కర్నూలు జిల్లాలోనూ తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications