నల్లమల అటవీప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

కర్నూలు: జిల్లా నల్లమల అటవీప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, 1260 జిలిటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్లతో పాటు.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Heavy blast material seized in Kurnool

రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు నగరంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వారికి చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+