నేడు ద్వాదశ రాశులలో ఈ రాశులవారి పంట పండుతుంది... మీ రాశి ఉందా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో జూలై 13వ తేదీన గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేటి గ్రహాల స్థితిని గమనిస్తే రవి మిధున రాశిలో సంచారం చేస్తుండగా, చంద్రుడు కూడా మిధున రాశి లోనే సంచారం చేస్తున్నాడు.
నేడు గ్రహాల స్థితి ఇలా
కుజుడు సింహరాశి లోను, బుధుడు కర్కాటక రాశిలో, గురుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు సింహరాశిలో, శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల స్థితి కారణంగా నేడు ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి జాతకులకు ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. తోడబుట్టిన వారి నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. చిన్నపాటి ప్రయాణాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. నేడు మేషరాశి వారికి శుభ సమయం.నేడు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు అన్ని విధాలుగా కలిసివస్తుంది. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యాల పైన చర్చలు జరుగుతాయి. పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది.
మిధున రాశి
చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల మిధున రాశి వారికి మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన పనులు ప్రారంభించడానికి ఈరోజు బాగుంటుంది. పెద్దవారి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దైవ స్మరణ చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి జాతకులకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అనవసర ప్రయాణాలు వల్ల అలసట వస్తుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకుంటే మంచి జరుగుతుంది. నేడు కుటుంబ సభ్యులు సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. నేడు శివనామస్మరణ ఉత్తమంగా ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి నేడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. సూర్యాష్టకం పఠించటం మంచిది.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
తులారాశి
తులా రాశి వారికి భాగ్యస్థానం అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు చేసే వారికి కలిసి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. లలితా చాలీసా పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి జాతకులకు పనులలో కొంత ఆలస్యం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు నేడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు లాభాలను చేకూరుస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వీరికి శుభప్రదంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారి శత్రువుల పైన విజయం సాధిస్తారు. కోర్టు వివరాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుండి మకర రాశి వారికి ఉపశమనం కలుగుతుంది. మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభరాశి
కుంభ రాశి వారు సంతానం నుండి శుభవార్తలు వింటారు. మేధస్సుకు పదును పెట్టే పనులు విజయవంతమవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశం ఉంది. నేడు శని గాయత్రి మంత్రం జపించడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. తల్లి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. నూతన వస్త్ర వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గురు చరిత్ర పారాయణం చేయడం, దత్తాత్రేయ స్వామి పూజ చేయడం మంచిది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications