మృగశిరలోకి వెళ్ళే కుజుడు మీకు సంపదల కుంభవృష్టి కురిపించనున్నాడు

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి, వివిధ రాష్ట్రాలలో గ్రహాల సంయోగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడమే కాకుండా, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి కూడా సంచారం చేస్తాయి. నవగ్రహాలలో కుజుడిని ధైర్యానికి, పరాక్రమానికి, భూమికి, కెరీర్ కు కారకుడిగా చెబుతారు.

సొంత నక్షత్రమైన మృగశిరలోకి కుజుడు

అటువంటి కుజుడు జులై 24వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడి నక్షత్రం మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది .మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

mars transit in mrigashira nakshatra on july 24th luck wealth and happiness to these zodiac signs

మేషరాశి

మేష రాశికి కుజుడు స్వయంగా అధిపతి. అటువంటి కుజుడు మృగశిర నక్షత్రం లోకి సంచారం చేయడం మేష రాశి జాతకులకు అమితమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కెరీర్ పరంగా వీరికి బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఆఫీసులో పనికి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ పాత బాకీలు వసూలవుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహరాశి

కుజుడి నక్షత్ర సంచారం సింహ రాశి జాతకులకు శుభ యోగంగా మారుతుంది. ఈ సమయంలో సింహరాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. సింహ రాశి వారికి గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

కుజుడి నక్షత్రం మార్పు వృశ్చిక రాశి వారికి శుభ యోగాలను తెచ్చిపెడుతుంది. వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి ఎన్నడూ లేనంతగా బలోపేతమవుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళా నెరవేరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. కుటుంబంలో విభేదాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

కుజుడి అశుభ ప్రభావం నుండి బయటపడే పరిహారం ఇదే

జూలై 24వ తేదీ నుండి కుజుడి అశుభ ప్రభావం పడే రాశుల వారు దాని నుండి ఉపశమనం పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. దీనివల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాస్త ప్రతికూలతల నుండి విముక్తి లభిస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+