హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలం కాని కాలం: వానతో తడిసి ముద్దైన హైదరాబాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విచిత్రంగా ఈ కాలంలో వర్షం పడుతోంది. వడగళ్లు కూడా పడుతున్నాయి. నగరంలోని మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఉప్పల్, తార్నక, సికింద్రాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎపుడూ ఊహించిన విధంగా పెద్ద పెద్ద వడగళ్లతో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కూడా వడగండ్ల వాన కురిసింది.

Heavy rain in Hyderabad

వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల నగరంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతంలోకి వర్షపు నీరు రావడంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరబండా, యూసుప్‌గూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది.

రాష్ట్రంలో పలు చోట్ల మంగళవారం ఉదయం వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షంతో మిరప, మొక్కజొన్న, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటి ల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ధర్మసాగరం, ములుగు, ఏటూరు నాగారం, చేర్యాల, నల్లబెల్లిలో కురిసిన భారీ వర్షాలకు మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం ఏర్పడింది.

English summary

 Heavy rains has beem witnessed by Hyderabad and Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X