ఏపీకి మరో భారీ వర్ష సూచన-మళ్లీ మూడు రోజుల వర్షాలు-బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం
ఏపీని వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు, తుపాన్ల కారణంగా వరుసగా వర్షాలు తప్పడం లేదు. తాజాగా మరో ద్రోణి ఏర్పడటంతో మూడు రోజుల పాటు వర్షాలు తప్పవని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితి.
ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న తూర్పు గాలులతో ఏర్పడిన ద్రోణి, నైరుతి బంగాళా ఖాతము దగ్గర నున్న ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం నుంచి ఉత్తర బంగాళా ఖాతంలోని మధ్య ప్రాంతాల వరకు వ్యాపించి ఈరోజు శ్రీలంక నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ౦.9 కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించియున్నదని వాతావరణ శాఖ తెలిపింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని..రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.
Recommended Video
ఏపీలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పలు జిల్లాల్లో పంటల నష్టం జరుగుతోంది. వరుస వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పలు జిల్లాల్లో సహాయక చర్యలు చేపడుతున్నా మళ్లీ తిరిగి వర్షాలు పడటంతో అధికారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రాయలసీమలో తాజా వర్షాల కారణంగా భారీగా పంటనష్టాలు తలెత్తాయి. ఇప్పుడు మరోసారి వర్షాల హెచ్చరికతో రైతులకు ఆందోళన తప్పడం లేదు. తాజా వర్ష సూచనతో ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications