బాదుడే బాదుడు.. ఛార్జీల మోత మోగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ !!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులు అంతా సొంతూర్లకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రైళ్లు, ఆర్టీసీ, బైకులు అనే తేడా లేకుండా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ప్రయాణికులతో రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దీగా మారడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే దారులన్నీ సంక్రాంతి కోసమే అన్నట్టు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 65, సూర్యాపేట-ఖమ్మం 365బీబీ, నార్కట్‌పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, గుంటూరు వైపు వెళ్లే రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ నెలకొంది.

ఈ మేరకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీల దోపిడీకి తెగబడుతున్నాయి. కాగా ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ వేల సంఖ్యలో అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నాయి. అయినప్పటికీ డిమాండ్‌కు సరిపడ సీట్లు అందుబాటులో లేకపోవడంతో.. ప్రయాణికులకు ఆర్టీసీలో టికెట్లు దొరకడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.

heavy-trollings-on-private-travels-charges-on-sankranthi-festival

బాదుడే బాదుడు..

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు రూ.450 నుంచి రూ.800 మధ్య ఉంటే.. ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం రూ.2,700 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ లహరి ఏసీ బస్సులో ఛార్జీ సుమారు రూ.1,500 కాగా.. ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం రూ.4,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ ఆర్టీసీ సర్వీసులు ఈ మార్గంలో రూ.1,050 నుంచి రూ.2,600 మధ్య అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ, స్లీపర్ బస్సుల పేరుతో అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారు. ఇలా మొత్తంగా స్వస్థలాలకు వెళ్లే కుటుంబాలకు ఈ అధిక ఛార్జీలు భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి. నలుగురు సభ్యుల కుటుంబం పండుగకు రానుపోను ప్రయాణం చేయాలంటే కేవలం బస్సు ఛార్జీలకే రూ.20,000 నుంచి రూ.25,000 వరకు ఖర్చవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్

ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. పండుగల సమయంలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అధిక ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్‌పై భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రవాణా శాఖ హెచ్చరికలకు లెక్కలేదా?

తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘించిన 75 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమిది RTA బృందాలతో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టి బస్సులను సీజ్ చేస్తున్నా.. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీ కొనసాగుతూనే ఉంది.

అనుమతికి మించి ఛార్జీల వసూలు..

నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఛార్జీల కంటే గరిష్ఠంగా 50 శాతం అదనంగా మాత్రమే వసూలు చేయడానికి ప్రైవేటు బస్సులకు అనుమతి ఉంది. కానీ వాస్తవ పరిస్థితిలో ప్రైవేటు ట్రావెల్స్ ఈ పరిమితిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో రెట్టింపు, మరికొన్ని మార్గాల్లో మూడు రెట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలు హెచ్చరికలు జారీ చేసినా, అవి పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+