ఆ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు: ధృవీకరించిన బెంగళూరు పోలీస్ కమీషనర్
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చి వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్, సిద్ధికి, రణధీర్, రాజ్ భవ్ లను అరెస్ట్ చేశారు.
ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానన్న హేమ
అయితే ఈ రేవ్ పార్టీలో నటి హేమ, హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ రేవ్ పార్టీ పైన అందరికంటే ముందు స్పందించిన నటి హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని తాను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్లోని ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేశారు.

తప్పుదారి పట్టించే యత్నం చేసిన హేమ: బెంగళూరు సిటీ కమీషనర్
అయితే బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నదని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఆమె నిన్న విడుదల చేసిన వీడియో ఎక్కడినుంచి తీశారో విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. నటి హేమ అందరిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారని, అందుకే ఫామ్ హౌస్ దగ్గర ఒక వీడియో చేసి రిలీజ్ చేశారని పేర్కొన్నారు.
రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ కమీషనర్ ఏమన్నారంటే
ఈ పార్టీలో ప్రజాప్రతినిధులు ఎవరు పాల్గొనలేదని పోలీస్ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్నందుకు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి 50 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజ్ అని మొత్తం వందమంది ఈవెంట్లో పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ పేర్కొన్నారు.
రేవ్ పార్టీలో అరెస్ట్ చేసిన వారికి మెడికల్ టెస్టులు
మొత్తం ఈ రేవ్ పార్టీలో 30 మంది యువతులు, 70 మంది యువకులు, ఏపీ, హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో వచ్చారని వెల్లడించారు. ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రేవ్ పార్టీలో అరెస్టు చేసిన వారికి మెడికల్ టెస్ట్ లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications