ఏపీలో కూటమి పాలనకు ఏడాది-నెరవేర్చిన హామీల చిట్టా ఇదే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో భారీ ఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు.. గత ఏడాది పాలనలో వాటిని ఎంత మేరకు నెరవేర్చారన్న దానిపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హామీల అమలును ఓసారి చూద్దాం..

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ 142 హామీల్ని నెరవేర్చినట్లు అధికార పార్టీలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి నెరవేర్చిన హామీలతో ఓ పోస్టర్ ను కూడా వైరల్ చేస్తున్నాయి. ఇందులో ముందుగా నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీ 4 వేలకు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వవైభవం వరకూ మొత్తం 142 హామీలు నెరవేర్చినట్లు చెబుతున్నాయి.

here is list of 142 promises kept by Chandrababu government in one year rule

ఈ లెక్కన ప్రభుత్వం నెరవేర్చిన హామీల్లో కీలకంగా పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, దీపం 2 పథకంతో ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, చెత్త,నాలా పన్నుల రద్దు, రేషన్ షాపుల్లో రేషన్, ఉచిత ఇసుక, కర్నూల్లో హైకోర్టు బెంచ్, ఒకటో తేదీనే ఉద్యోగులకు, పెన్షన్లర్లకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు, టీచర్ల 117 జీవో రద్దు, క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభం ఇలా చాలానే ఉన్నాయి.

రాష్ట్రంలో సంక్షేమాన్ని పూర్తిగా మూలనపడేశారని విమర్శలు ఎదురవుతున్న వేళ తాజాగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్దం కావడం, అలాగే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చేసిన ప్రకటన వంటివి లబ్దిదారులకు ఊరటనిచ్చే అంశాలే. ఏడాది పాలనలో కీలకమైన హామీల్ని దాదాపుగా నిలబెట్టుకున్న ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో వాటిని ఎంత మేర పక్కాగా అమలు చేస్తుందన్న దానిపై కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+