అదీ నా తోబుట్టువే: నారా లోకేష్
హెరిటేజ్ ఫ్యాక్టరీ తన తోబుట్టువుతో సమానమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
చిత్తూరు: హెరిటేజ్ ఫ్యాక్టరీ తన తోబుట్టువుతో సమానమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీకి తన తల్లి నారా భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణితో కలిసి వచ్చారు.
ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. కార్మికులందరినీ సొంత బంధువుల్లా చూసుకోవడం వల్లే ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

తాను చిత్తూరు జిల్లా కోడలు కావడం వల్లే మారుమూల ప్రాంతాలైన గ్రామాల రైతులు కూడా తమ సంస్థను ఆదరించి, పాలను అందజేస్తున్నారని నారా భువనేశ్వరి అన్నారు.
అనంతరం ఐతేపల్లె సింగిల్‌విండో చైర్మన్ సుబ్రహ్మణ్యంనాయుడు, కాశిపెంట్ల సర్పంచు గాలి సతీష్‌లు నారా లోకేశ, బ్రహ్మణి, భువనేశ్వరిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాంట్ సీఎం వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ గౌష్‌బాషా, టీడీపీ నేతలు, సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications