ప్రధానితో నాగార్జున ఫ్యామిలీ - తండేల్ పై ఏమన్నారు..!!

ప్రధాని మోదీతో హీరో నాగార్జున సమావేశమయ్యారు. తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జున వచ్చారు. అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల తో సహా ప్రధానితో సమావేశం అయ్యారు. గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు. కొద్ది కాలం క్రితం మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వర రావు పై ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ నుంచి వీరికి ఆహ్వానం అందింది.

అటు అక్కినేని నాగార్జున తండేల్ సినిమా విడుదల వేళ ఇటు మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వర రావు చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆ తరువాత మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవా దాలు తెలిపారు. అయితే, అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్' విడుదల అయిన రోజునే ప్రధానితో ప్రత్యేక భేటీ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య - శోభితను నాగార్జున ప్రధానికి పరిచయం చేసారు. ఇద్దరినీ ప్రధాని అభినందించారు.

Hero Nagarjuna meets PM Modi along with Family members in parliament building

ఇప్పటి వరకు లవర్ బాయ్ గా పలు సినిమాల్లో కనిపించిన అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాలో పాకిస్థాన్ లో దొరికిపోయిన జాలరిగా కనిపించారు. తన పాత్రలో మెప్పించారు. ఇక, ఈ భేటీ సమయంలో సినీ పరిశ్రమ గురించి ప్రధాని మోదీ ఆసక్తి కరంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ విజయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటు నాగచైతన్య సినీ కెరీర్ గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత టీడీపీ ఎంపీ శబరితో సమావేశం అయ్యారు. మర్యాద పూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ భేటీ అంశం అటు రాజకీయంగా.. ఇటు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+