అవినాశ్ కు బిగ్ రిలీఫ్ - సీబీఐ కు హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పైన తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాశ్ సీబీఐ దర్యాప్తు తీరును తప్పు బట్టారు. లోప భూయిష్టంగా ఉందని వాదించారు. సునీత తరపు న్యాయవాది అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కొట్టి వేయాలని కోరారు. ఈ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపించింది. అనేక అంశాలను ప్రస్తావించింది. కోర్టు కూడా పలు ప్రశ్నలు సంధించింది. ఈ నెల 31న తుది తీర్పు ఇస్తామని పేర్కొన్న న్యాయమూర్తి..అప్పటి వరకు అవినాశ్ పైన చర్యలు తీసుకోవద్దని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టులో సుదీర్ఘ విచారణ : వైఎస్ వివేకా కేసులో రెండో రోజుల హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అవినాశ్ తరపు న్యాయవాది దాదాపు అయిదు గంటల సేపు కేసు పూర్వపరాలను వివరించారు. సీబీఐ దర్యాప్తు లోప భూయిష్టంగా ఉందని వాదించారు.

 avinashcbi-

ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కౌంటర్ లోని అంశాల ఆధారంగా నిందితుడని ముద్ర వేస్తున్నారని వివరించారు. వివేకా హత్య జరిగిన రోజున జమ్మలమడుగు వెళ్తున్న సమయంలో అవినాశ్ కు సమాచారం వచ్చిందని కోర్టుకు నివేదించారు. ఆ తరువాత సునీత తరపు న్యాయవాది అవినాశ్ తీరు పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటీషన్ కొట్టి వేయాలని కోరింది. ఈ రోజు ఉదయం నుంచి సీబీఐ తమ వాదనలు వినిపించింది.

కోర్టు పలు ప్రశ్నలు : సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. హత్యకు వెనుక ప్రధాన ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించింది. దీని పైన సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. వైఎస్ వివేకా ఎమ్మెల్సీ ఓటమి వెనక కారణాలు ఉన్నాయన్నారు. అవినాశ్ కు ఎంపీ సీటు అనధికారికంగా ముందే ఖరారైందనే విషయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. అవినాశ్ బలమైన నేత అయినప్పుడు వివేకా ను హత్య చేయాల్సిన అవసరం ఎంటని ప్రశ్నించారు.

ఎర్ర గంగిరెడ్డి, శివ శంకర్ రెడ్డి సహకారంతో ఈ ఘటన జరిగిందని సీబీఐ ఆరోపించింది. విచారణలో అవినాశ్ తమకు సహకరించటం లేదని..ఏదో కారణంతో విచారణ వాయిదా వేస్తున్నారని కోర్టుకు వివరించారు. హత్యకు నెల రోజుల ముందే ప్రణాళిక సిద్దం చేసారని సీబీఐ తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు.

 avinashtelanganahighcourt

సీబీఐకి ఆదేశాలు : రాకీయంగా వివేకా పైన పై చేయి సాధించేందుకే అవినాశ్ భావించారని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనల సమయంలో కోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలకు సీబీఐ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయిందని తెలుస్తోంది. వాదనలు పూర్తి కావటంతో ఈ నెల 31న బుధవారం తీర్పు ఇస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న అవినాశ్ తరపు న్యాయవాది అప్పటి వరకు సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అవినాశ్ తల్లి ఆస్పత్రిలో ఉండటంతో..అవినాశ్ కు తల్లి బాధ్యతలు ఉన్నాయని నివేదించారు. దీనికి అనుగుణంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 31వ తేదీ వరకు అవినాశ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. కొద్ది రోజులుగా సీబీఐ అరెస్ట్ పైన ఒత్తిడితో ఉన్న అవినాశ్ కు ఇది పెద్ద రిలీఫ్ గా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+