నెరవేరనున్న కానిస్టేబుల్‌ కల - బిగ్ అప్డేట్..!!

హోం గార్డుల సుదీర్ఘ కల నెరవేరనుంది. న్యాయపరమైన చిక్కులు తాజాగా హైకోర్టు తీర్పుతో తొలి గిపోయాయి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోం గార్డుల రిజర్వేషన్ అంశం పై హైకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఏడాదిన్నార కాలంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ఇప్పుడు వేగంగా ముందుకు కదలనుంది.

హైకోర్టు తీర్పుతో
కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు డిసెంబర్ 3న వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు తుది తీర్పు ఇచ్చింది. హోంగార్డుల‌ు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందేందుకు ప్రాథ‌మిక రాత ప‌రీక్షల్లో క‌నీస మార్పులు రావాల్సిందేన‌ని పోలీసు నియామ‌క బోర్డు (ఎస్ఎల్‌పీఆర్‌బీ) నిబంధన తీసుకొచ్చింది. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథ‌మిక రాత ప‌రీక్షలో క‌నీస అర్హత మార్కులు సాధించ‌లేదంటూ పలువురు హోంగార్డులను అన‌ర్హులుగా పేర్కొది. దీంతో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ప‌లువురు హోంగార్డులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

High Court directed the Police Recruitment Board to consider home guards as a special category

గత ప్రభుత్వ హయాంలో
గత వైసీపీ ప్రభుత్వం 2022, నవంబరు చివరి వారంలో 6,100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 4.58లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకు న్నారు. వీరికి 2023, జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్‌ నిర్వహించి 95,208 మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించింది. తొలి దశలో ప్రాథమిక రాతపరీక్ష పూర్తయ్యాక రెండో దశలో దేహధారుఢ్య (పీఈటీ), శారీరక సామర్థ్య పరీక్షలు (పీఎంటీ) నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు మార్చి 13నుంచి 20 దాకా నిర్వహిస్తామని హాల్‌టికెట్లు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం సివిల్‌ హోంగార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ హోంగార్డులకు 25శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది.

నియామక ప్రక్రియ
దీని ప్రకారం మొత్తం 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో 1100 హోంగార్డులకే కేటాయించాలి. అయితే, ప్రాథమిక పరీక్ష 3వేల మంది హోంగార్డులు రాయగా ఫలితాల తర్వాత 382 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో హోం గార్డులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కోర్టు తీర్పు కోసం వేచి చూస్తూనే... మరో వైపు అర్హులైన 95,208 మందికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు నియామక బోర్డు రెండోదశ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 29వరకు ఆన్‌లైన్‌లో వారికి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో రెండోదశ పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత సాధించిన వారికి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన 6,100 మందిని ఉద్యోగాల్లో నియమించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+