విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి గంటా అలా చేశారా?: హైకోర్టు నోటీసులు.. రుణం కోసం ప్రభుత్వ భూముల్నే!..

'ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల కోసం తాకట్టు పెట్టిన భూముల్లో ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కోర్టు చిక్కులు తప్పడం లేదు. ఇండియన్ బ్యాంకు నుంచి రుణం పొందిన తన సోదరులకు చెందిన కంపెనీకి మంత్రి గంటా హామిదారుగా ఉన్నారు. రుణం సకాలంలో చెల్లించకపోవడం పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు సిద్దపడింది.

కాగా, మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖప ట్నం డాబాగార్డెన్‌లోని ఇండియన్‌ బ్యాంకు నుంచి 2005లో దాదాపు రూ.141.68 కోట్లు రుణం తీసుకుంది. ఈ క్రమంలో మంత్రులు గంటా సహా ఆయన బంధువులకు చెందిన పలు ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది.

మరో షాక్: మంత్రి గంటాకు చెందిన మరిన్ని ఆస్తులు స్వాధీనం, ఇవే..మరో షాక్: మంత్రి గంటాకు చెందిన మరిన్ని ఆస్తులు స్వాధీనం, ఇవే..

High court notice to minister ganta srinivasarao

ఇదిలా కొనసాగుతుండగానే మంత్రి గంటాపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. 'ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల కోసం తాకట్టు పెట్టిన భూముల్లో ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

English summary
Highcourt was issued notice to Minister Ganta Srinivasa Rao over the loans taken from bank. The allegation on Minister that he was submitted govt land documents for loan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X