RRR: సీఐడీ అధికారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా, పోలీసులకు ?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా పనిచేసిన విజయ్ పాల్ పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అప్పటి సీఐడీ అధికారి విజయ్ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రఘురామ కృష్ణరాజు అదే పార్టీ ఎంపీ అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్ కు వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగా ఆరోపణలు చేసిన అప్పటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లిపోయారు. తరువాత ఢిల్లీ, హైదరాబాదులోనే ఎక్కువ రోజులు కాలం గడిపిన రఘురామ కృష్ణరాజు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఆ తర్వాత జైలుకు పంపించారు తనను అరెస్టు చేసిన సమయంలో తనను పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టారని, అప్పటి సీఐడీ అధికారులు టీఎస్ఆర్ ఆంజనేయులు, విజయ్ పాల్ తదితరులు తనను చిత్రహింసలకు గురి చేశారని, పోలీస్ స్టేషన్లో పెట్టి తనను కొట్టారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పటి సీఐడీ అధికారులు ఆంజనేయులు, విజయ్ పాల్ తదితరులపై రఘురామ కృష్ణరాజు గుంటూరులో కేసు పెట్టారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1వగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటికి సీఐడీ అధికారి విజయ్ పాల్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర, హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అప్పుడు సీఐడీ అధికారులుగా పనిచేసిన ఆంజనేయులు, జయపాల్ తదితరులు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ క్లైట్ ను వేధింపులకు గురి చేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు పనులు చేశారని, అందుకే పోలీసు అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారని రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు.
అప్పుడు పోలీసు అధికారులు తప్పులు చేశారని కొందరిని సస్పెండ్ చేశారని, ఈ కేసులో ముందస్తు విజయ్ పాల్ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదని రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు హైకోర్టుకు మనవి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో ఈనెల 24వ తేదీన ఈ కేసులో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి విజయ్ పాల్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైందని సమాచారం.












Click it and Unblock the Notifications