BIGG BOSS TELUGU : సెన్సార్ లేకుండా బిగ్ బాస్ షో ఎలా ? కళ్లు మూసుకోలేమన్న హైకోర్టు..

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోను సెన్సార్ లేకుండా ప్రసారం చేయడంపై ఏపీ హైకోర్టు మండిపడింది. బిగ్ బాస్ తెలుగును నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అంతే కాదు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం సిద్ధమవుతున్న నిర్వాహకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటున్నాయని, ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్ల వస్త్రధారణ నుంచి, వారు మాట్లాడుతున్న మాటలు, చేష్టల వరకూ ఏదీ సెన్సార్ లేకుండా ప్రసారం అవుతున్నాయని, అలాగే ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల మధ్యే ప్రసారం చేయాలని నిబంధనలు కూడా ఉన్నాయని గుర్తుచేస్తూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

High Court serious on BIG BOSS TELUGU without censorship, notices to centre, state, organizers

ముందుగా సెన్సార్ చేయకుండా బిగ్ బాస్ తెలుగు వంటి రియాల్టీ షోలను ఎలా ప్రసారం చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించింది. షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలను పరిశీలించడం అంటే పోస్టు మార్టం చేయడం లాంటిదేనని తెలిపింది. దీంతో ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదని స్టార్ మా యాజమాన్యం తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం షో ప్రసారం కానంత మాత్రాన కళ్లు మూసుకుని కూర్చోలేమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రానికి తగు సూచనలు చేస్తామని తెలిపింది.

మరోవైపు ఇలాంటి షోను టీవీల్లో ముందుగా సెన్సార్ చేయకుండా ప్రసారం చేస్తున్న అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టార్ మా యాజమాన్యం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్, హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునకు కూడా నోటీసులు పంపింది. అలాగే ఈ విషయంపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ప్రతీ ఛానల్ కూడా ఇలాంటి ఆశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా అని ప్రశ్నించింది. నైతిక విలువల్ని కాపాడకపోతే ఎలా అని నిలదీసింది. దీనిపై లోతుగా విచారణ చేసి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+