అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు, నారాయణ భవితవ్యం తేలేది నేడే-హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతిలో దళితులకు చెందాల్సిన అసైన్డ్‌ భూముల్ని బదలాయించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన అట్రాసిటీ కేసులపై చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరూ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించనుంది. వీటితో పాటు టీడీపీ తరఫున కూడా మరో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన అట్రాసిటీ కేసుల చెల్లుబాటుపై హైకోర్టు ఇవాళ విచారణ జరపబోతోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు చంద్రబాబు, నారాయణకు మాత్రమే కాదు, భవిష్యత్‌ కేసులకూ మార్గదర్శనం చేయబోతోంది.

సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు- క్వాష్‌ పిటిషన్ దాఖలు- ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలనిసీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు- క్వాష్‌ పిటిషన్ దాఖలు- ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని

చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై విచారణ

చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై విచారణ

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన అట్రాసిటీ కేసులపై చంద్రబాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లు ఇవాళ హైకోర్టు ధర్మాసనం ముందుకు రానున్నాయి. దళితుల భూముల విషయంలో వారికి అన్యాయం చేసిన వీరిద్దరిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నోటీసులు పంపిన సీఐడీ... ఈ నెల 23న విచారణకు రావాలని కోరింది. అయితే అసలు అట్రాసిటీ కేసు పెట్టాలని దళితుడు కాని ఎమ్మెల్యే కోరడం చెల్లదని ఇప్పుడు వీరు వాదిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చే తీర్పు పలు విధాలుగా కీలకంగా మారింది. దళితులకు అన్యాయం జరిగిన సందర్భంలో అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలని ఎవరైనా కోరవచ్చా లేక బాధితులే కోరాలా అన్న అంశంపై హైకోర్టు ఇచ్చే తీర్పు క్లారిటీ ఇవ్వబోతోంది. అలాగే అసలు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయవచ్చా లేదా అన్న అంశంపైనా హైకోర్టు స్పష్టత ఇవ్వనుంది. కాబట్టి ఈ తీర్పు వీరిద్దరికీ వ్యక్తిగతంగానే కాకుండా భవిష్యత్‌ కేసుల విచారణకూ మార్గదర్శకంగా నిలవబోతోంది.

రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు

రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు

అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ తమపై నమోదు చేసిన అట్రాసిటీ కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగంగానే అని పిటిషనర్లు చంద్రబాబు, నారాయణ ఆరోపిస్తున్నారు. కేసుల పేరుతో టీడీపీ నేతల్ని వేధించడానికి వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలను కూడా కోర్టులు అడ్డుకున్నాయన్న విషయాన్ని వీరిద్దరూ తమ పిటిషన్లలో గుర్తు చేశారు. 2016లో అప్పటి ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదంతో తీసుకున్న నిర్ణయంపై ఆరేళ్ల తర్వాత కేసులు పెట్టడం కక్షసాధింపులో భాగమేనని పిటిషన్లలో పేర్కొన్నారు. అసలు ఈ కేసుకు మూల కారణమైన జీవో 41లో ఎలాంటి చట్ట, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరగలేదని, అటువంటప్పుడు జీవో జారీ చేయడానని నేరంగా పరిగణిస్తూ కేసులు ఎలా పెడతారని వాదిస్తున్నారు.

English summary
andhra pradesh high court on today hear quash petitions filed by tdp chief chandrababu and his former cabinet minister narayana on ap cid's attrocity case in amaravati lands issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X