Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు బ్రేక్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, నిన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇక తాజాగా ఆయన విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు.

దీంతో వైద్యులు రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కారణంగానే వారాహి విజయ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. మళ్లీ ఈ నెల 30వ తేదీన భీమవరంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆపై వారాహి విజయయాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని జనసేన నాయకులు భావిస్తున్నారు.

pawankalyan7

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదఅమిరం లోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేయడం వల్లనే ఆయన అనారోగ్యం బారిన పడ్డారని పలువురు భావిస్తున్నారు. నిన్న భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో జరగాల్సిన సమావేశం పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి తన వారాహి విజయయాత్రను ప్రారంభించారు జిల్లాలో వారాహి విజయయాత్ర ను పూర్తిచేయాలని పర్యటన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం యాత్రకు బ్రేక్ వేశారు.ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ మిగిలిన జిల్లాలలో తన యాత్రను కొనసాగించనున్నారు.

వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానికంగా ఉన్న నేతలతో, మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనవాణి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ సాగిస్తున్న వారాహి విజయయాత్రలో అధికార వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+