వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు - గాల్లోకి పోలీసుల కాల్పులు : కొనసాగుతున్న విధ్వంసం..!!

అమలాపురంలో నిరసనలు విధ్వంసంగా మారాయి. మంత్రి విశ్వరూప్ ఇంటిని తగులబెట్టిన నిరసనకారులు..ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు అంటించారు. ఎమ్మెల్యే ఇల్లు దగ్దం అయింది. ఆందోళన కారులు పోలీసుల పైన రాళ్లు రువ్వటంతో పాటుగా పోలీసు వాహనాలు.. ప్రభుత్వ - ప్రయివేటు వాహనాలను ధ్వంసం చేసారు. సతీష్ ఇంటికి నిప్పు పెట్టటంతో లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లా ఎస్పీతో పాటుగా 20 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మూడు స్కూళ్ల బస్సులు దగ్దం అయ్యాయి. కోనసీమ జిల్లా పేరు మార్పు పైన కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సమయంలో... పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. అయితే, ఒక్కసారిగా అమలాపురం నాలుగు వైపులా పెద్ద సంఖ్యలో నిరసన కారులు తరలి వచ్చారు. తమను అడ్డుకున్న పోలీసుల పైన రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వసం చేసారు. మంత్రి విశ్వరూప్ తో పాటుగా.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు అంటించారు. ఇద్దరి నివాసాల వద్ద ఉన్నవాహనాలను దగ్ధం చేసారు.

High tension continues in Amalapuram, Police open fire in to the air to control violence

ఎంత వారించినా.. నిరసనకారులు నియంత్రణలోకి రాకపోవటంతో పోలీసులు గాల్లోకి కాలప్పులు జరిపారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిని వేలాది ఆందోళనకారులు చుట్టుముట్టారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటి వద్ద పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అమలాపురంకు బయల్దేరారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం అప్పీల్ చేసింది.

ఊహించని విధంగా రాళ్లదాడి.. పెద్ద సంఖ్యలో నిరసనకారులు రావటం.. వస్తూనే విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు సైతం వారిని నియంత్రించటం కష్టంగా మారింది. మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్తితి చోటు చేసుకుంది. ఆయన ఇంటి వద్ద ఆందోళన కారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో మంత్రి తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయారు. రాళ్ల దాడిలో గాయపడ్డ ఎస్పీకి ప్రాధమికంగా చికిత్స అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+