వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ తో అప్పుడు ... బిగ్ బాస్ ౩ తో ఇప్పుడు .. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తెరమీదకు తమన్నా

|
Google Oneindia TeluguNews

Recommended Video

BigG Boss 3 Telugu : Tamanna Simhadri Wildcard Entry || బిగ్ బాస్ 3 హౌస్ లో తమన్నా || Oneindia

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 తొలివారం పూర్తి చేసుకుంది. ఇక తొలివారంలో ఫస్ట్ ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. తొలివారం నామినేషన్‌లో ఎలిమినేషన్ కోసం సింగర్ రాహుల్, నటి పునర్నవి, హేమ, హిమజ, జాఫర్, వితిక నామినేట్ అవగా.. చివరకు సినీనటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సినిమా రంగం నుంచి వచ్చి బిగ్ బాస్‌లో బిగ్‌ సెలబ్రిటీ అని అందరూ అనుకున్నారు. అయితే తొలివారమే ఆమె ప్రేక్షకుల ఓటింగ్ దెబ్బకు బయటకు వచ్చేసింది. ప్రక్షకుల, అలాగే ఇంటి సభ్యుల ఓటింగ్ కూడా హేమకు నెగిటివ్ గా రావటంతో హేమ షాక్ కు గురయ్యారు. అయినప్పటికీ చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో బయటకు వచ్చేశారు. ఇక ఇదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీతో హిజ్రా తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యారు.

ఆ ఇద్దరు మంత్రులపై వేటు త‌ప్ప‌దా!! సీఎం జ‌గ‌న్ ఎందుకంత‌ సీరియ‌స్ : ఎవ‌రా మంత్రులు..!ఆ ఇద్దరు మంత్రులపై వేటు త‌ప్ప‌దా!! సీఎం జ‌గ‌న్ ఎందుకంత‌ సీరియ‌స్ : ఎవ‌రా మంత్రులు..!

మంగళగిరి నుండి లోకేష్ పై పోటీ చేసిన తమన్నా .. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి

మంగళగిరి నుండి లోకేష్ పై పోటీ చేసిన తమన్నా .. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి

వైల్డ్‌కార్డ్‌ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన ట్రాన్స్‌జెండర్ తమన్నాను తీసుకోవడం ద్వారా షోలో ఇంట్రస్ట్ పెంచాలని ఒక హిజ్రాకు ఛాన్స్ ఇచ్చినట్టు జనాల్లో ఆసక్తి కూడా పెరుగుతుందని నిర్వాహకులు భావించినట్లు తెలుస్తుంది. ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి, తనను తాను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఎంట్రీలో ప్రకటించారు.

తమన్నా బ్యాక్ గ్రౌండ్ ఇది ... రాజకీయాల్లో ఎన్నికల సమయంలో హీట్ రాజేసిన తమన్నా ..బిగ్ బాస్ లో ఏం చేస్తుందో

తమన్నా బ్యాక్ గ్రౌండ్ ఇది ... రాజకీయాల్లో ఎన్నికల సమయంలో హీట్ రాజేసిన తమన్నా ..బిగ్ బాస్ లో ఏం చేస్తుందో

ఇక తమన్నా బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే సోషల్ యాక్టివిస్ట్ గా ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి . గత ఎన్నికల్లో నారాలోకేష్ కు పోటీగా బరిలోకి దిగారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. . తమన్నా కొన్నాళ్లుగా మీడియా, యూట్యూబ్ చానళ్ల దర్వారా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. నటి శ్రీరెడ్డికి మొదట మద్దతిచ్చిన ఆమె తర్వాత ఆమెపై విమర్శలు చేశారు .ఇక రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫై అభిమానం కురిపించిన తమన్నా పవన్ విషయంలో చింతమనేని పై సవాల్ చేసారు. చింతమనేని పై పోటీ కి తాను చాలంటూ అప్పట్లో సంచలనం సృష్టించారు. ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చెయ్యాలని భావించి గత ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీదే పోటీ చేసి లోకేష్ పై విమర్శలు చేసిన తమన్నా సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెంచారు .

హిజ్రాల కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేలా తమన్నా ఎంట్రీ ... ఇంపాక్ట్ ఎలా ఉంటుందో

హిజ్రాల కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేలా తమన్నా ఎంట్రీ ... ఇంపాక్ట్ ఎలా ఉంటుందో

ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ప్రజలకు తానేమిటో చూపించాలని, అలాగే సమాజంలో ఇప్పటికే చిన్న చూపు చూడబడుతున్న హిజ్రాల కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోనికి అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ ట్రాన్స్ జెండర్ తో బిగ్ బాస్ హౌస్ సభ్యుల తీరు ఎలా వుంటుందో ... తమన్నా బిగ్ బాస్ హౌస్ లో సభ్యుల మనసు, అలాగే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేదో .. ఇంట్రెస్టింగ్ అంశమే ..

English summary
Transgender Tamanna Sinhadri stepped into the Bigboss house through a wildcard entry. The organizers seem to think that the interest of the public is likely to increase as Chance gives a hijra into the big boss house . The interest in the show by taking the transgender Tamanna, who is the reason for the sensations in last elections in mangalarigi . Tamanna Sinhadri, who was in the news for contesting from Mangalgiri on Lokesh in the AP election, has announced in an entry that she will enter the Big Boss house to prove herself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X