హిజ్రాల ఆగడాలు: యువకులపై దాడి, లింగమార్పిడి
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయి. హిజ్రాలు బలవంతంగా లింగమార్పిడి చేసి హిజ్రాలుగా మారుస్తున్నారని పలువురు హిజ్రాలుగా మారిన యువకులు ఆరోపించారు. లింగమార్పిడికి అంగీకరించకపోతే తమపై భౌతికంగా దాడులకు దిగి, బలవంతంగా లింగమార్పడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పలువురు హిజ్రాలు ఆరోపణలు చేస్తున్న తాడేపల్లిలోని హిజ్రాలుగా మారిన యువకులపై దాడి చేసి గాయపర్చారు. కాగా, గాయపడిన హిజ్రాలు మీడియాతో మాట్లాడుతూ.. తమను బలవంతంగా తీసుకొచ్చి హిజ్రాలు మార్చారని తెలిపారు.

రంభ అనే ఆమె తమను బలవంతంగా లింగమార్పిడి చేసి హిజ్రాలుగా మార్చిందని పలువురు హిజ్రాలుగా మారిన యువకులు తెలిపారు. రూ. 8లక్షలకు అమ్మేవారని ఒకరు చెప్పగా, మరొకరు తనను రూ. 6లక్షలకు అమ్మేసిందని చెప్పారు.
భద్రాచలం, గుంటూరు, తదితర ప్రాంతాలకు చెందిన తమను బలవంతంగా లింగమార్పిడి చేయించి, భిక్షాటన చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము భిక్షాటన చేసి డబ్బును రంభ అనే ఆమెకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
తమ లాంటి యువకులను ఇలా హిజ్రాలుగా మార్చి తమ కటుంబాలకు దూరంగా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లుగా వినకపోతే తీవ్రంగా కొడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా శిక్షించాలని హిజ్రాలుగా మార్చబడిన యువకులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications