హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ విషాదం: అరవింద్‌కు కన్నీటి వీడ్కోలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది దుర్ఘటనలో మరణించిన అరవింద్ కుమార్ అంత్యక్రియలు శుక్రవారం సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. గురువారం మృతదేహం లభించినా వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం విమానంలో శంషాబాద్‌కు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో వనస్థలిపురంలోని ఏటైవ్ క్వార్టర్స్‌లోని నివాసానికి తరలించారు.

కుమారుడి మృతితో అరవింద్ తల్లిదండ్రులు శశిలత, వినోద్ కుమార్‌లను ఏకధాటిగా రోదించారు. నాలుగు రోజులుగా అతడి కోసం ఎదురు చూస్తుండగా చివరకు విగతజీవిగా రావడంతో వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు. స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత రామ్మోహన్ గౌడ్ నివాళులర్పించారు.

బియాస్ నది వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన మరో విద్యార్థి సాబేర్ హుస్సేన్ మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం గుల్‌మొహర్‌పార్కులోని వారి ఇంటికి తీసుకువచ్చారు. మహ్మద్ సాబేర్ హుస్సేన్ పార్థివదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఎంతో చలాకీగా ఉండే తమ గారాలపట్టి ఇక లేడనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.

సాయంత్రం 5 గంటలకు లింగంపల్లిలోని మసీద్‌లో ప్రార్థనల అనంతరం లింగంపల్లి మైనార్టీ శ్మశాన వాటికలో కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు ని ర్వహించారు. కాగా, ఆచూకీ లభించని మిగితా 16మంది విద్యార్థుల కోసం బియాస్ నదిలో ఎన్డీఆర్ఎఫ్ సహా, ఐటిబిపి, ఎస్ఎస్‌బి తదితర సహాయ బృందాలు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది దుర్ఘటనలో మరణించిన అరవింద్ కుమార్ అంత్యక్రియలు శుక్రవారం సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో నిర్వహించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

గురువారం మృతదేహం లభించినా వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం విమానంలో శంషాబాద్‌కు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో వనస్థలిపురంలోని ఏటైవ్ క్వార్టర్స్‌లోని నివాసానికి తరలించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

కుమారుడి మృతితో అరవింద్ తల్లిదండ్రులు శశిలత, వినోద్ కుమార్‌లను ఏకధాటిగా రోదించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

నాలుగు రోజులుగా అతడి కోసం ఎదురు చూస్తుండగా చివరకు విగతజీవిగా రావడంతో వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

తమ మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అరవింద్ స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

ఎల్‌బి నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత రామ్మోహన్ గౌడ్ నివాళులర్పించారు.

అరవింద్ కుమార్ (ఫైల్)

అరవింద్ కుమార్ (ఫైల్)

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది దుర్ఘటనలో మరణించిన అరవింద్ కుమార్ అంత్యక్రియలు శుక్రవారం సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో నిర్వహించారు.

English summary
The dead body of Aravind Kumar hailing from Vanasthalipuram of Hyderabad, was retrieved from the Beas River early on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X