ఏపీలో అక్కడ హోలీనాడు జంబలకిడి పంబ!!

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగుల పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేళి రంగేళి, సంబరాల హోలీ అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టమైన వంటలు తింటారు.తమ వారందరితో వేడుక చేసుకుంటారు.

మగవారంతా ఆడవాళ్ళుగా
హోలీ నాడు చాలా ప్రాంతాల్లో అనేక వింత ఆచారాలను పాటిస్తున్నారు. నేటికీ అనేక ప్రాంతాల్లో హోలీ వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో సంతేకుడ్లురు గ్రామంలో హోలీ పండుగ రోజున వింత ఆచారం కొనసాగుతుంది. హోలీ పండుగ నాడు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది.

అనాదిగా కొనసాగుతున్న ఆచారం
విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగను జరుపుకుంటారు. రెండు రోజులపాటు సాగే ఈ వేడుకలో పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ళ వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారు విశేషంగా నమ్ముతున్నారు. స్త్రీల తరహాలో పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు. ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతుంది.

Holi special custom in ap kurnool district Santhekudluru men dress up as women

వింత ఆచారం వెనుక అనాదిగా నమ్మకం
ఇలా చేయడం వల్ల గ్రామస్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని బలంగా నమ్ముతారు. అయితే గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి ఇలా చేస్తామని అంటున్నారు. గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి అనాదిగా ఇది పాటిస్తున్నామని అంటున్నారు. పురుషులు ఆడవాళ్ళ వేషధారణ వేసి పూజలు చేయడం తమ ఆనవాయితీ అని వారు చెబుతున్నారు.

ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు సైతం ఆడవారిగా వేషధారణ
ఇక ఇక్కడ వారి ఈ విచిత్ర సాంప్రదాయాన్ని చూడడానికి చాలా ప్రాంతాల నుండి జనం వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారు. వచ్చిన వారు కూడా ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు . ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా, మహిళల వేషధారణలో దేవుడిని పూజిస్తారని చెబుతున్నారు. ఇది ఇక్కడి వారి తరతరాల సాంప్రదాయం అని అంటున్నారు. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. అత్యంత ఘనంగా మగవాళ్ళు అందరూ ఆడవారిగా చీరలు కట్టుకుని, అలంకరించుకుని జరుపుకునే ఈ పండుగ ఏపీలో హోలీ స్పెషల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+