తిరుమల లడ్డూ, జగన్ బహిరంగ చర్చకు సిద్దమా, హోం మంత్రి సవాల్
తిరుమల శ్రీవారి లడ్డు తయారీలోకల్తీ నెయ్యి విషయంపై శ్రీ వెంకటేశ్వరస్వామి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడించారని, తిరుమల శ్రీవారిని కూడా వైసీపీ నాయకులు రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో అన్ని వ్యవస్థల లాగే తిరుమల లడ్డును కూడా జగన్ కల్తీ చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని హోం మంత్రి అనిత వ్యంగంగా అన్నారు. చేసిన అపరాధానికి ప్రశ్చాతప పడకుండా వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం పైన ఎదురుదాడి దిగటానికి ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు.

జగన్ ఇలాగే ప్రవర్తిస్తే పులివెందులలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని, అదే పులివెందుల ప్రజల జగన్ ను ఓడిస్తారని హోం మంత్రి అనిత వ్యంగంగా అన్నారు. తిరుమల లడ్డుల నెయ్యి కల్తీపై దమ్ముంటే చర్చకు రావాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత వైసీపీ నాయకులకు, జగన్ కు సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కల్తీ చేశారని, చివరికి కోట్లాదిమంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల తయారీ కోసం కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారని, ఇలాంటి వారిని తన జీవితంలో ఎక్కడా చూడలేదని హోం మంత్రి అనిత ఆరోపించారు.

మా వంద రోజుల పాలనపై జగన్ విమర్శలు చెయ్యడం విడ్డూరంగా ఉందని హోం మంత్రి అనిత అన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో మీరు తప్పు చెయ్యకపోతే బహిరంగ చర్చకు రావాలని జగన్ కు హోం మంత్రి అనిత సవాలు విసిరారు. ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని, అంతేకానీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించరని హోం మంత్రి అనిత అన్నారు.
మంత్రిగా పనిచేసిన ఆర్ కే రోజా తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు అమ్మ పోలేదా ? అని హోం మంత్రి అనిత వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాపై విచారణ జరిపించి తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత వైసీపీ నాయకులు హెచ్చరించారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నాయకులను ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హోం మంత్రి అనిత అన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications