"శాంతి" భద్రతలంటూ సాయిరెడ్డి Vs హోం మంత్రి అనిత..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా మాజీ సీఎం జగన్ ధర్నా చేసారు. ఇండియా కూటమి లోని కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు హాజరయ్యాయి. అయితే , జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత్ ఘాటుగా స్పందించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పై సాయిరెడ్డి ఎక్స్ ఖాతాలో కీలక వ్యాఖ్యలు చేసారు. హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు.

Home Minister Anitha counter for Sai Reddy over Law and orders allegations in the state

సాయిరెడ్డి చేసిన పోస్టుకు హోం మంత్రి వంగలపూడి అనిత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "శాంతి" -భద్రతల విషయాల్లో మీరు (సాయిరెడ్డి) రాజీనామా చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది... అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు...ఎన్డీయే ప్రభుత్వం..ప్రజలు బానే ఉన్నారు... దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, X లో రెట్టలు వేస్తున్నారు ..అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి మాట్లాడుతున్న వైసీపీ హత్యకు గురైన వారి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సాయిరెడ్డి తాజాగా రాజ్యసభలోనూ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సాయిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఆదేశించారు. ఇక.. జగన్ ఢిల్లీ ధర్నా ద్వారా రాజకీయంగానూ సమీకరణాలు మారుతున్నాయి. జగన్ ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారనే చర్చ మొదలైంది. కానీ, జగన్ మాత్రం ఆ అంశం పైన నేరుగా స్పందించటం లేదు. ఇక.. ఏపీలో శాంతి భద్రతల అంశం పైన ప్రభుత్వం పైన వైసీపీ విమర్శలు కొనసాగిస్తుండగా..టీడీపీ వాటిని కౌంటర్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+