కర్నూలులో హనీ ట్రాప్.. వలపు వల వేసి, యువకుడి అర్ధ నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ .. ఆపై
కాలం మారింది. అమ్మాయిలను, అబ్బాయిలు మోసం చెయ్యటమే కాదు అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి . పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వలపు వల వేసి ప్రేమ పెళ్లి పేరుతో దోచుకుంటున్న వారు కొందరైతే, పెళ్ళిళ్ళు చేసుకుని నిత్య పెళ్లి కూతుళ్ళుగా ఉడాయిస్తున్న వారు ఇంకొందరు. ఇక ట్రాప్ చేసి శృంగారపు ఉచ్చులో మోసం చేస్తున్న వారు మరికొందరు.
వలపు వల వేసి దోచుకుంటున్న గ్యాంగ్ లు .. కర్నూలులో యువకుడు బలి
ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్లను ట్రాప్ చేసి, వారి ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే మోసాలకు పాల్పడితే, ఇప్పుడు ఆ పనిలో మగవాళ్ళని మించిపోయారు మగువలు. హనీ ట్రాప్ తో మగవాళ్ళను ముగ్గులోకి దించడం, వారు చెప్పినది చేసేలా చేయడం.. ఆపై వారిని బెదిరించడం అందినకాడికి దండుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇక తాజాగా కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.
ఓ యువతి వలపు వలలో చిక్కుకున్న యువకుడు ఆమె ఏం చెబితే అది చేశాడు. చివరకు బట్టలు లేకుండా నగ్నంగా ఆమెకు ఫోటోలను సైతం షేర్ చేశాడు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ఫోటోలను అడ్డు పెట్టుకుని రంగంలోకి దిగిన గ్యాంగ్ బ్లాక్ మెయిల్
ఫోటోలను అడ్డుపెట్టుకొని ఓ గ్యాంగ్ రంగప్రవేశం చేసింది. ఆ యువకుడి వద్దకు వెళ్లి యువకుడి అర్ధనగ్న ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ కి దిగింది. అడిగినంత డబ్బు ఇస్తే ఓకే.. లేదంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించింది. సమాజంలో పరువు మర్యాదలతో బ్రతికే వాళ్ళు అలాంటి ఫొటోలు బయటకు వస్తే డబ్బు పరువు రెండూ పోతాయని భయపడి హనీ ట్రాప్ ముఠాలకు అడిగినంత ముట్టజెప్పి దండం పెడుతున్నారు. ఈ క్రమంలోనే సదరు యువకుడు కూడా లక్షల రూపాయలను ఆ ముఠాకి ముట్టజెప్పాడు.
పదుల సంఖ్యలో హనీ ట్రాప్ గ్యాంగ్ బాధితులు .. ఐదుగురు సభ్యులు అరెస్ట్
అయినప్పటికీ వారి టార్చర్ ఎక్కువ కావడంతో భరించలేక కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో షాకింగ్ విషయాలను కనుగొన్నారు. ఇలా యువతి వలలో పడి బాధితుడిగా మారింది ఈ ఒక్క యువకుడే కాదు, పదుల సంఖ్యలో యువకులు ఉన్నారని గుర్తించి షాక్ తిన్నారు. పక్కా స్కెచ్ వేసి మరీ యువకులను దోపిడీ చేస్తున్న ఈ ముఠా గుట్టు రట్టు చేశారు కర్నూల్ పోలీసులు. ఈ వ్యవహారంలో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తియ్యగా మాట్లాడి ట్రాప్ చేసే మహిళలతో తస్మాత్ జాగ్రత్త
నిందితుల వద్ద నుండి నాలుగు లక్షల విలువైన రెండు ప్రాంసరీ నోట్ లు, నాలుగు లక్షల విలువైన రెండు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మంది బెదిరించింది ? ఎంత మంది వద్ద ఎంత డబ్బులను వసూలు చేసింది అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ట్రాప్ చేసి ఇంటికి పిలిపించుకొని మహిళలతో చనువుగా ఉన్న, అర్ధ నగ్నంగా, నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాలు ఒక కర్నూలు జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా తమ దందా సాగిస్తున్నాయి. అందుకే ఎవరైనా మహిళలు చనువుగా మాట్లాడుతూ ఫోన్ చేస్తే వారి మాయలో పడొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హనీ ట్రాప్ ముఠాలు రాష్ట్రంలో రెచ్చిపోతున్నాయి అని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications