హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే: ఊళ్లకు తరలిన హైదారాబద్ సిటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం చెప్పడంతో ఈ నెల 19వ తేదీన సర్వే కోసం హైదరాబాద్ నగరంలోని ప్రజలు, పట్టణాల్లోని ప్రజలు గ్రామాల బాట పట్టారు. హైదరాబాద్‌లోని ప్రజలు తమ తమ గ్రామాలకు తరలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19న ‘సమగ్ర కుటుంబ సర్వే'ను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది.

సర్వేకు ప్రతి కుటుంబం హాజరు కావాల్సిందేనని ప్రభుత్వం. దీంతో పట్టణాల్లో నివసిస్తున్నవారు, ఇతర రాష్ట్రాలకు వలసపోయినవారు గ్రామాలకు తిరిగొస్తున్నారు. సర్వే రోజున నివాసం ఉన్నచోటనే తమ వివరాలు అందించవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే తాత్కాలిక ఉపాధి కోసం పట్టణాలకు వచ్చినవారు మాత్రం తమ చిరునామాను పల్లెల్లోనే నమోదు చేసుకోవాలని భావిస్తున్నారు.

ఉపాధి కోసం పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన చాలామంది సొంత ఊరి చిరునామాతోనే కొనసాగుతున్నారు. కొందరైతే అటు పల్లెల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ చిరునామా కలిగి ఉన్నారు. పట్టణాల్లోని అద్దె నివాసాల్లో చిరునామా నమోదు చేయించడానికి చాలామంది సుముఖంగా లేరు. అందుకే సొంత ఊరిలోనే వివరాలు అందించాలని భావిస్తున్నారు.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు సర్వే చేపడుతున్నందున ఏదో ఒకచోటనే కుటుంబాలు తమ వివరాలను నమోదు చేయించనున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

లెక్కకు మించిన రేషన్‌కార్డులు జారీ కావడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పలు దఫాలుగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఎవరు, ఎక్కడ నివాసం ఉన్నా... అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలను అందించాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

ముఖ్యమంత్రి ప్రకటనను బట్టి పల్లెలోనూ, పట్టణంలోనూ రెండుచోట్లా వివరాలు నమోదుచేసే అవకాశాలు లేవు. దీంతో ఎక్కడ, ఎన్ని కుటుంబాలు, ఎంత జనాభా అన్నది సర్వేతో స్పష్టం కానుంది.

నగరం పల్లెబాట...

నగరం పల్లెబాట...

ఉపాధి కోసం నగరానికి వచ్చిన పల్లెజనం మూటాముల్లె సర్దుకుని గ్రామాల బాట పట్టారు. దీంతో బస్సు స్టేషన్లు రద్దీగా మారిపోయాయి.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

హైదరాబాదు నుంచి గ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైల్వే స్టేషన్లు కూడా క్రిక్కిరిసిపోయాయి. రైళ్లలోనూ వేలాడే పరిస్థితి ఉంది.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

రైల్వే స్టేషన్లలో పల్లెకు తరలిపోతున్న ప్రజలతో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. వారు తమ పేర్లను గ్రామాల్లో నమోదు చేయించుకోవడానికి పల్లెబాట పట్టారు.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

మూటాముల్లెలు సర్దుకుని హైదరాబాద్ ఉపాధి కోసం వచ్చిన ప్రజలు తమ స్వగ్రామాలు చేరుకోవాడనికి రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

నగరం పల్లెబాట

నగరం పల్లెబాట

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గ్రామాలకు వెళ్లే ప్రజలతో క్రిక్కిరిసిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి.

English summary
People are rushing to their villages to participate in household survey from Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X