• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ రోడ్ మ్యాప్ తో రాజధానులకు చెక్ ? వైసీపీ, టీడీపీ ఇద్దరికీ షాక్ ! సుప్రీంలో తేలనున్న బిగ్ ప్లాన్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసీపీపై ఉమ్మడి విపక్ష పోరుకు రోడ్ మ్యాప్ కోరిన పవన్ కు తాజాగా విశాఖ టూర్ లో ప్రధాని మోడీ కొత్త రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ఇందులో భాగంగా బీజేపీ స్టాండ్ అయిన అమరావతి రాజధానిని బీజేపీ-జనసేన కూటమి తమ అస్త్రంగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వైసీపీతో పాటు టీడీపీకి కూడా చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది.

 రాజధానుల పోరులో రోడ్ మ్యాప్ ట్విస్ట్

రాజధానుల పోరులో రోడ్ మ్యాప్ ట్విస్ట్

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు మరికొంతకాలం సాగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో అమరావతికి మద్దతుగా విపక్షాలు కూడా ఏకం అవుతాయని అంతా భావిస్తుండగా.. తాజాగా ప్రధాని మోడీ వైజాగ్ టూర్ ఇందులో కొత్త ట్విస్టులు ఇచ్చేలా కనిపిస్తోంది. వైసీపీపై పోరుకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదనే కోపంతో మధ్యలో చంద్రబాబును కలిసి హెచ్చరికలు పంపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు మోడీ తాను అడిగిన రోడ్ మ్యాప్ ఇచ్చేశారు. అయితే అది కొన్ని మార్పులతో మాత్రమే. దీంతో ఈ రోడ్ మ్యాప్ ఏపీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపబోతోంది.

పవన్ అడిగిన రోడ్ మ్యాప్

పవన్ అడిగిన రోడ్ మ్యాప్

బీజేపీ నేతల్ని పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఓ రోడ్ మ్యాప్ అడుగుతున్నారు. ఇందులో వైసీపీపై పోరుకు బీజేపీ-జనసేన మాత్రమే కాకుండా ఉమ్మడిగా విపక్షాలన్నీ కలిపి పోరాటం చేసేలా రోడ్ మ్యాప్ ఇమ్మని కోరుతున్నారు. దీనికి బీజేపీకి కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, కేంద్రంలో వైసీపీ ఎంపీలతో అవసరాలు అడ్డంకిగా మారాయి. దీంతో పవన్ కోరిన విధంగా రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు బీజేపీ సిద్దపడలేదు. కానీ పవన్ ఊరుకోలేదు. రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని కాషాయ నేతలకు తేల్చిచెప్పేశారు. దీంతో సోమువీర్రాజు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. దాని తర్వాతే ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖాయమైంది.

మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్

మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్

విశాఖలో అడుగుపెట్టగానే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే వైసీపీపై పోరుకు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదనే కోపంతో ఉన్న పవన్ ను బుజ్జగిస్తూనే భవిష్యత్తులో తమ వ్యూహాలు దెబ్బతినకుండా ఉండేలా ప్రధాని మోడీ ఆచితూచి స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ కోరినట్లుగానే రోడ్ మ్యాప్ ఇస్తూనే అందులో కొన్ని కీలక మార్పులు చేశారు. అవి బీజేపీ-జనసేన పొత్తు కొనసాగిస్తూనే అమరావతిపై పోరు ముమ్మరం చేయాలని సూచించారు. అదే సమయంలో రాజధానుల పోరుపై న్యాయస్ధానాల్లోనూ అమరావతికి కేంద్రం నుంచి మద్దతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా ఒకే దెబ్బకు వైసీపీ, టీడీపీ ఇద్దరికి చెక్ పెట్టి బీజేపీ-జనసేన కూటమి నెగ్గుకొచ్చే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం.

వైసీపీ, టీడీపీ ఇద్దరికీ చెక్ పెట్టేలా ?

వైసీపీ, టీడీపీ ఇద్దరికీ చెక్ పెట్టేలా ?


ప్రధాని మోడీ తాజాగా పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రోడ్ మ్యాప్ నిజమైతే మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా ఇప్పటివరకూ బీజేపీ చేస్తున్న పోరాటానికి కేంద్రం అధికారికంగా తోడవుతుంది. నిర్ణీత సమయంలో ఈ ప్రతిపాదన అడ్డంకులు దాటలేకపోవడం, నిధుల కొరత వంటి కారణాలతో ఒకే రాజధాని ప్రతిపాదనకు కేంద్రం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. గతంలో ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేసిన అమరావతికే తమ మద్దతు ఉంటుందని కేంద్రం చెప్పే అవకాశాలున్నాయి. తద్వారా వైసీపీ మూడు రాజధానులకు చెక్ పడటంతో పాటు అటు అమరావతిలో ఛాంపియన్ గా చెప్పుకునే అవకాశాన్ని టీడీపీ నుంచి దూరం చేసి బీజేపీ-జనసేనకు క్రెడిట్ దక్కేలా చూసుకునే అవకాశముంది. ఇది కుదరకపోతే మాత్రం టీడీపీని కలుపుకుని ముందుకెళ్లొచ్చని చెప్తున్నారు.

 సుప్రీంలో తేలనున్న బిగ్ ప్లాన్ ?

సుప్రీంలో తేలనున్న బిగ్ ప్లాన్ ?

ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కు విశాఖలో రహస్యంగా చెప్పిన రోడ్ మ్యాప్ ప్లాన్ బయటపడాలంటే సుప్రీంకోర్టులో సాగుతున్న అమరావతి పిటిషన్ల విచారణ కీలకం కానుంది. ఇందులో కేంద్రం వైఖరిని సుప్రీంకోర్టు కచ్చితంగా కోరబోతోంది. ఇందులో ఒకవేళ కేంద్రం రాజధానులు రాష్ట్రానికి సంబంధించిన అంశమని గతంలో హైకోర్టులో చెప్పిన విషయాన్ని పునరుద్ధాటిస్తే సరి. అలా కాకుండా ప్రతీ రాష్ట్రానికి అధికారికంగా ఒకే రాజధానిని కేంద్రం గుర్తిస్తుందని చెబితే మాత్రం రాజధానుల వ్యవహారంలో భారీ ట్విస్ట్ తప్పదు. అప్పుడు బీజేపీ-జనసేన కూటమిని రాష్ట్రంలో దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా తేలాలంటే సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది.

English summary
pm modi's latest road map to pawan kalyan may affect three capital plans and ysrcp and tdp's chances also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X